BlackBerry Key2 కి లభించిన FCC సెర్టిఫికేషన్ , 7 జూన్ న లాంచ్…

Updated on 22-May-2018

బ్లాక్బెర్రీ తన కీ 2 స్మార్ట్ఫోన్ ని  జూన్ 7 న ప్రారంభించబోతోంది. ఈ డివైస్ ఇప్పటికే TENAA, WFA మరియు Bluetooth SIG చే ధృవీకరించబడింది మరియు ఇప్పుడు ఈ డివైస్ ని  US FCC ఆమోదించింది.

TENAA ఈ స్మార్ట్ఫోన్ స్పెక్స్ పోస్ట్ చేసింది . ఇది  3: 2 యాస్పెక్ట్ రేషియో తో  4.5 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది మరియు రిజల్యూషన్ 1620 x 1080 పిక్సల్స్  ఉంటుంది. అదనంగా, పరికరం ఒక OCTA- కోర్ స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్, 6GB RAM మరియు 64GB స్టోరేజ్ఉంటుంది. దీనితో పాటు, మైక్రో SD కార్డు 128GB కి పరికరం యొక్క స్టోరేజ్ ని  పెంచవచ్చు. అదనంగా, డ్యూయల్  కెమెరాలు, 3.5mm ఆడియో జాక్స్ మరియు టైప్-సి పోర్ట్లు ఉన్నాయి.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే , 12MP ప్రాధమిక సెన్సార్ మరియు 8MP సెకండరీ సెన్సార్  పరికరం యొక్క వెనుక భాగంలో ఉంటుంది. దీనితో పాటు, 8MP సెల్ఫీ  కెమెరా పరికరం ముందు భాగంలో ఉంటుంది అని చెప్పబడుతోంది.  బ్యాటరీ 3,360 mAh ఉంటుంది మరియు పరికరం Android 8.1 oreo తో ప్రారంభించబడుతుంది. బ్లాక్బెర్రీ KEY2 యొక్క ధర మరియు లభ్యత గురించి సమాచారం లేదు, అయితే పరికరం యొక్క ఇతర సమాచారం కూడా సమీపంగా వస్తోంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :