Samsung Galaxy A50 పైన రూ.6,000 భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

అధనంగా Axis యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

శామ్సంగ్ యొక్క A సిరీస్ కెమేరాలు మరియు స్పీడ్ ప్రాసెసర్లతో ఆకట్టుకుంటాయి. ఈ A సిరీస్ నుండి ప్రీమియం డిజైనుతో పాటుగా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేతో వచినటువంటి గెలాక్సీ A 50 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు బరి డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ రూ.18,990 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేయబడింది. అయితే, ప్రస్తుతం Flipakrt ప్రకటించిన "మొబైల్ బొనాంజా " నుండి  ఈ ఫోన్ యొక్క 4GB/64GB  బ్లూకలర్ వేరియంట్ కేవలం రూ.12,999 రూపాయల ధరకే లభిస్తుంది. అధనంగా Axis యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Galaxy A50 డిస్కౌంట్ ధర

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్  Rs.18,490 ధరతో ఉండగా, ప్రస్తుతం ఈ సేల్ నుండి కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. అయితే, మరొక వేరియంట్ అయినటువంటి, శామ్సంగ్ గెలాక్సీ A50 ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్ మాత్రం ముందుగా పొందిన డిస్కౌంట్ ధర అయినటువంటి రూ.17,999 రూపాయల ధరకు అమ్ముడవుతోంది. వాస్తవానికి, ఈ వేరియంట్ మొదట Rs. 21,490 ధరతో అమ్ముడయ్యింది.

శామ్సంగ్ గెలాక్సీ A50

గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా,  ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.  ఇది వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్  కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఈ  శామ్సంగ్ గెలాక్సీ A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇది, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.                         

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :