ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్ : OPPO A9 పైన భారీ డిస్కౌంట్

ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్ : OPPO A9 పైన భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

గేమింగ్ పనితీరును పెంచే హైపర్‌బూస్ట్ వంటి సాఫ్ట్‌ వేర్ పనితాన్ని కలిగి ఉంటుంది.

అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన "ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్" ని ప్రకటించింది మరియు ఈ సేల్ నుండి అనేకమైన లేటెస్ట్ OPPO స్మార్ట్ ఫోన్ల పైన భారి ఆఫర్లను ప్రకటించింది.  ఇందులో భాగంగా, ఇటీవల ఇండియాలో మిడ్-రేంజ్ ధర విభాగంలో విడుదల చేసిన A9 స్మార్ట్‌ ఫోన్ను చాలా తక్కువ ధరకే అమ్ముడు చేస్తోంది.  ఈ ఒప్పో A9 యొక్క ముఖ్యాంశాలు చూస్తే గనుక, ఇది పొడవైన ఆస్పెక్ట్ రేషియో, తక్కువ కాంతి(Low-Light)  ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా నైట్ మోడ్, 4020mAh + బ్యాటరీ మరియు ఫోన్ యొక్క గేమింగ్ పనితీరును పెంచే హైపర్‌బూస్ట్ వంటి సాఫ్ట్‌ వేర్ పనితాన్ని కలిగి ఉంటుంది.

వాస్తవానికి, ఈ ఒప్పో A 9 భారతదేశంలో రూ .15,490 ధరతో విడుదల చెయ్యబడింది. అయితే, ఈ సేల్ నుండి కేవలం రూ.11,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇది ఒకే స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది, అంటే 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ మాత్రమే ఉంటుంది. 

Oppo A9 ప్రత్యేకతలు

ఒప్పో A9 స్మార్ట్ ఫోనులో ఒక 6.5 -అంగుళాల పూర్తి HD + (1080×2340 పిక్సెల్స్) డిస్ప్లేని ఒక 84.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో మరియు వాటర్‌డ్రాప్ నోచ్ డిజైనుతో అందించింది.ఇది ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇది మీడియా టెక్ హెలియో P 60 చిప్‌ సెట్‌తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా  Color 6.0OS పైన  పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ విషయంలో,  ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర స్కానరుతో  వస్తుంది.

కెమెరా విభాగంలో, ఈ ఒప్పో A9 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇది 16MP ప్రాధమిక సెన్సార్‌ను f / 1.8 లెన్స్ మరియు 2MP సెకండరీ సెన్సార్‌తో జతగా కలిగి ఉంది. ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నోచ్ లో 16 MP సెల్ఫీ కెమెరా ఉంది, అది f / 2.0 అపర్చరు లెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా 130 నుదుటి పాయింట్లను గుర్తించగలదని మరియు ఫేస్ స్లిమ్మింగ్ ఫీచర్‌తో పనిచేస్తుందని ఒప్పో సంస్థ పేర్కొంది.

కనెక్టివిటీ విషయంగా, ఈ ఒప్పో A9 లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS / A-GPS మరియు OTG మద్దతుతో మైక్రో- USB ఉన్నాయి. ఇక సెన్సార్ల విషయానికి వస్తే, దీనికి యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఒక పెద్ద 4020mah బ్యాటరీని స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజితో కలిగివుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo