హానర్ 20i స్మార్ట్ ఫోన్ పైన 6,000 రూపాయల భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడు చేస్తోంది.

హానర్ నుండి వెనుక ట్రిపుల్ కెమేరా మరియు 32MP సెల్ఫీకెమెరా కలిగి మంచి కెమేరా పనితనంతో ఇండియాలో విడుదల అయినటువంటి హానర్ 20i స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు అమెజాన్ ఇండియా తన ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, అనేక ఆసక్తికరమైన ఫీచర్లతో  ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వాస్తవానికి, ముందుగా  Rs. 16,999 ధరతో లాంచ్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు 6,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.10,999 ధరతో అమేజాన్ ఇండియా నుండి అమ్ముడవుతోంది.

బ్యాంక్ ఆఫర్లు :

HDFC బ్యాంక్ యొక్క డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలుఈ చేసినట్లయితే, 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.   

హానర్ 20i ధర

హానర్ 20i ( 4GB + 128GB ) ధర – Rs. 10,999 

హానర్ 20i ప్రత్యేకతలు :

20i లోఅందించిన వాటర్ డ్రాప్ నోచ్, ఒక U- ఆకారంలో చెయ్యబడింది మరియు ఇందులో ఒక సెల్ఫీ కెమేరాని కలిగి ఉంది, ఇది ఒక 6.21 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD + రిజల్యూషనుతో వస్తుంది మరియు 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే, ఇది 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో   వస్తుంది. ఈ ఫోను యొక్క ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా f / 2.0 ఎపర్చరుతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మల్టిఫుల్ ఫేస్ బఫరింగ్ ఫిచరును అందిస్తుంది. దీనితో పాటు, ఈ స్క్రీన్ ఫ్లాష్ లాగా కూడా మద్దతిస్తుంది.

ఇక రియర్ కెమేరా విషయానికి వస్తే,  ఒక ఎపర్చరు F / 1.8 కలిగిన 24 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ మరియు దానికి జతగా రెండవ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు మూడవ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి, ఈ 20i వెనుక AI ట్రిపుల్ కెమెరాని కలిగివుంది. ఈ కెమెరా,  నైట్ సీన్ మోడ్, యాంటీ షేక్, సూపర్ Slo- మోషన్ వీడియో, ప్రొఫెషనల్ మోడ్, వైడ్ మరియు పోర్ట్రైట్ మోడ్ వంటి అనేక ఎంపికలతో పాటుగా వస్తుంది. ఈ ఫోన్ కిరిణ్ 710 SoC కి జతచేయబడిన 4 GB RAM శక్తితో పనిచేస్తుంది. ఇది 128GB అంతర్గత స్టోరేజి మరియు 512GB వరకు స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ముందు ఫేస్ అన్లాక్ ఫిచరుతో ఉంటుంది . ఈ ఫోన్ Android 9 పై ఆధారంగా EMU 9 తో పనిచేస్తుంది. ఈ పరికరంలో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి గేమ్ Turbo 2.0 జతచేయబడింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / AC, బ్లూటూత్ 4.2, జీపీఎస్, మైక్రోUSB 2.0, GPS మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ అందిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :