బిగ్ డీల్: నథింగ్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

నథింగ్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తోంది

Flipkart నుండి ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మీకు అందుబాటులోవుంది

బిగ్ డీల్: నథింగ్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

బిగ్ డీల్: నథింగ్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి. భారీ అంచనాలతో ఇండియాలో విడుదలై సక్సస్ సాధించిన Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తోంది. Flipkart నుండి ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మీకు అందుబాటులోవుంది.  నథింగ్ ఫోన్ (1) పైన ఫ్లిప్ కార్ట్ సేల్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ఆఫర్లు మరియు ఫోన్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (1): అఫర్ ధర మరియు ఆఫర్లు

నథింగ్ ఫోన్ (1) బేసిక్ వేరియంట్ (8GB+128GB) రూ.32,999 ధరతో లాంచ్ చెయ్యబడింది. అయితే, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి ఈరోజు 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను American Express, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్స్ అఫర్ తో ఈ ఫోన్ ను మీరు కేవలం రూ.25,999 ధరకే అందుకోవచ్చు.        

Nothing Phone (1): స్పెక్స్

నథింగ్ ఫోన్ (1)  6.55 ఇంచ్ డిస్ప్లేని  FHD+  రిజల్యూషన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే మరియు 60Hz -120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లేని ఎగువ ఎడమ మూలలో పంచ్-హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 778G+  శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 642L GPU తో పనిచేస్తుంది. ఇది 12GB  ర్యామ్ మరియు 256GB UFS 3.1 వరకూ స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత Nothing OS తో పనిచేస్తుంది.

ఇక నథింగ్ ఫోన్ (1) ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అయితే, ఈ సెటప్ లో భారీ కెమెరాలనే అందించింది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు EIS సపోర్ట్ తో 50MP SonyIMX766 కెమెరాగా జతగా 50MP (Samsung JN1) సెన్సార్ ని రెండవ కెమెరాగా అందించింది. అలాగే, సెల్ఫీల కోసం ముందు 16MP SonyIMX471 కెమెరాని జతచేసింది.

నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను మాత్రం  చేర్చలేదు. అంటే, ఈ ఫోన్ కోసం మీరు ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేయాలి. నథింగ్ ఫోన్ (1) పూర్తిగా మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది మరియు 7.6mm మందంతో చాలా స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, వైఫై 6, బ్లూటూత్ 5.2 మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo