రూ. 20,000 ధరలో 5 బెస్ట్ కెమేరా ఫోన్లు
ప్రస్తుతం మార్కెట్లో గొప్ప కేమేరా ఫీచర్లతో అందుబాటులో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్లను గురించి చుద్దాం.
ఇప్పుడు మార్కెట్లో కెమేరా ఫోన్ల హావ నడుస్తోంది. యువత తమ ప్రతి మూమెంట్ ని తమ కెమెరాలతో బంధించాడనికి ఎక్కువ మక్కువ చూపడం మరియు కెమెరాలలో మంచి ఫీచర్లను కూడా అందించడంతో, కెమేరా ఓరియంటెడ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కాబట్టి, ప్రస్తుతం మార్కెట్లో గొప్ప కేమేరా ఫీచర్లతో అందుబాటులో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్లను గురించి చుద్దాం.
Survey1. SAMSUNG GALAXY A50
ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక 8MP+25MP +5MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. A50 స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Amazon నుండి రూ. 19,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.
2. REDMI NOTE 7 PRO
ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్, కేవలం షావోమి మాత్రమే అందించింది. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది.
3. NOKIA 7.1
నోకియా 7.1 ఫోన్ ఒక 6.4 అంగుళాలసూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక భాగంలో 16MP+5MP Zeiss Lens డ్యూయల్ కెమెరాతో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది మరియు ఇది ఒక 3D Arc డిజన్ తో వస్తుంది. అలాగే ఒక 4,000 mAh బ్యాటరీ ఇందులో అందించింది. ఈ ఫోన్, ఒక Exynos 7904 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 4GB ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ ,బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Amazon నుండి రూ. 16,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.
4. SAMSUNG GALAXY M30
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది.
5. REALME 3 PRO
రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8% స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519 సెన్సారుతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
