కొత్త స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి ఈ రోజు బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఒకటి అందుబాటులో ఉంది. ఈ టీవీ మంచి ఫీచర్స్ తో ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయ్యింది మరియు సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది బెస్ట్ బడ్జెట్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఉంటుంది మరియు ఈరోజు కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 55 ఇంచ్ QLED Smart Tv డీల్?
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అదేమిటంటే, రియల్ మీ టెక్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,499 ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీ అందించిన రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ టీవీ కేవలం రూ. 26,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి BOB CARD, HSBC మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మంచి విజువల్స్ ను మీరు ఆస్వాదించవచ్చు. ఈ టీవీ క్వాడ్ ప్రోసెసర్ పై నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 40W లౌడ్ సౌండ్ అవుట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో ఆకట్టుకునే సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు బెజెల్ లెస్ డిజైన్ కూడా వస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ తో లిస్ట్ అయ్యింది.