లీకైన అసూస్ Zenfone మాక్స్ ప్రో M2 మరియు Zenfone మాక్స్ M2 స్పెక్స్

HIGHLIGHTS

ఒక టిప్స్టర్ ప్రకారం, భారతదేశ - నిర్దిష్ట పరికరాలతో రెండు వేర్వేరు రకాలైన ఆసుస్ నాలుగు వేరియంట్లను విడుదల చేస్తుంది.

లీకైన అసూస్ Zenfone మాక్స్ ప్రో M2 మరియు Zenfone మాక్స్ M2 స్పెక్స్

రెండు కొత్త స్మార్ట్ఫోన్లు, ZenFone మ్యాక్స్ ప్రో (M2) మరియు Zenfone మాక్స్ M2 లపై ఆసుస్ పని చేస్తున్నట్లు తెలిసింది, మరియు రెండు స్మార్ట్ఫోన్ల యొక్క   కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. టిప్స్టెర్ రోలాండ్ క్వాన్ద్ట్ ప్రకారం, కంపెనీ మొత్తం నాలుగు మోడళ్లను ప్రారంభించనుంది, వీటిలో రెండు భారత-సెంట్రిక్ వేరియంట్లుగా చెప్పబడుతున్నాయి. అయితే, టిప్స్టర్ వాటి యొక్క మోడల్ సంఖ్యలు మినహా, ఈ భారతదేశం నిర్దిష్ట వేరియంట్ల యొక్క మరింత సమాచారాన్ని బహిర్గతం చేయలేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Quandt ప్రకారం, ZenFone మాక్స్ ప్రో (M2) మోడల్ సంఖ్య ZB631KL కలిగి మరియు ఒక 6 అంగుళాల పూర్తి HD + స్క్రీన్, 4GB RAM మరియు 64GB లేదా 128GB నిల్వ ఎంపికలతో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్ చేత శక్తినివ్వవచ్చు – ఇది ఈ ఏడాది ప్రారంభించబడ్డ ZenFone మాక్స్ ప్రో (M1) యొక్క స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసరుకు అప్గ్రేడుగా, శక్తివంతం చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్ మోడల్ సంఖ్య ZB633KL తో ZenFone మాక్స్ M2 మరియు ఈ పరికరం కూడా 6-అంగుళాల FHD + డిస్ప్లేని కలిగి ఉంటుంది కానీ 4GB RAM మరియు 32GB / 64GB నిల్వ ఎంపికలతో Snapdragon 636 ప్రాసెసర్ ద్వారా ఆధారితం కావచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఆసుస్ ZenFone మాక్స్ ప్రో ఒక 13MP ముందు కెమెరా మరియు తిరిగి ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పుతో రావచ్చని భావిస్తున్నారు. ఇక  ఆసుస్ ZenFone మాక్స్ M2 విషయానికివస్తే, ఇది ఒక 13MP ముందు షూటర్ మరియు ఒక డ్యూయల్  వెనుక కెమెరా సెటప్పును కలిగివుంటుందని చెప్పబడింది. ఆసుస్ ZB632KL మోడల్ యొక్క ZenFone మాక్స్ M2, మరియు ఆసుస్ ZB634KL మోడల్ యొక్క ZenFone మాక్స్ ప్రో (M2)   భారతీయ వైవిధ్యాలుగా వర్ణించబడ్డాయి. ఈ స్మార్ట్ఫోన్లను 2019 MWC లో విడుదలచేయవచ్చు.

 

 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo