అసూస్ ROG 2 : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ SoC, 120Hz OLED తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

అసూస్ ROG 2 : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ SoC, 120Hz OLED తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ ఫోన్, ఎంత స్పీడుగా ఉంటుందో అంత క్వాలిటీని కూడా అందిస్తుంది.

అసూస్, ఇప్పటి వరకూ ఎవరూ తీసుకురానటువంటి బెస్ట్ ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది, అదే ఈ అసూస్ ROG 2 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ గురించి యెంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోనులో అందించిన ఫీచర్లు అలావుంటాయి. ఈ ఫోన్ను, క్వాల్కమ్ తాజాగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసురు మరియు ఇప్పటి వరకు మొబైల్ డిస్ప్లేలో తీసుకురాని 120Hz OLED డిస్ప్లేతో అందించింది. ఈ ఫోన్, ఎంత స్పీడుగా ఉంటుందో అంత క్వాలిటీని కూడా అందిస్తుంది.

అసూస్ ROG 2 ప్రత్యేకతలు

ఈ ఫోన్ ఒక 6.59 అంగుళాల పరిమాణం గల OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది అత్యధికంగా, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. తద్వారా ఇది 10-Bit HDR10 కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ డిస్ప్లేలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా అందించారు. ఇందులో, గేమింగ్ కోసం క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ని అందించినది. ఈ ప్రాసెసరుకు జతగా గరిష్టంగా ఒక 12GB ర్యామ్ కూడా అందించడంతో అవధులు లేని స్పీడ్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతమని చెప్పొచ్చు.  ఈ గొప్ప ర్యామ్ కి తగ్గట్టుగానే 512GB స్టోరేజిని కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇంత స్పీడ్ కలిగిన ఈ ఫోనుకు తగినట్లుగా ఒక పెద్ద 6,000 mAh  బ్యాటరీని కూడా ఇచ్చింది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఇందులో ఒక 48MP కెమెరాని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోనుతో నిరంతరంగా 7 గంటలు PUBG గేమ్ ఆడుకోవచ్చని అసూస్ పేర్కొంది. అధనంగా, ఈ ఫోనుతో పాటుగా మూడు కొత్త రకం కన్సోల్ లను కూడా అందించింది. వాటిలో, ఒకటి ఏరో – యాక్టివ్ కునాయ్ కూలర్ ఫ్యాన్ వస్తుంది. దీన్ని కునాయ్ గా కంపెనీ పిలుస్తోంది. అలాగే, ఫోనుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకునేలా రెండు JoyPad లను కూడా అందిస్తుంది. మొత్తంగా చూస్తే, ఇది ఒక స్మార్ట్ ఫోనుగా కాకుండా ఒక చిన్న సైజు కంప్యూటర్ లాగా అనిపిస్తుంది.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo