Apple iPhone 15 Plus ఫోన్ పైన గొప్ప ఆఫర్లు అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ను వీలైనంత తక్కువ ధరకు అందుకునేలా ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ అందించింది. సింపుల్ గా చెప్పాలంటే, ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ ఏకు అప్గ్రేడ్ కావడానికి తగిన ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ జత చేసింది. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ను తక్కువ ధరకు అందుకోవడానికి ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 15 Plus : డీల్
ఐఫోన్ 15 ప్లస్ బేసిక్ వేరియంట్ ఈరోజు రూ. 66,999 రూపాయల ధరకు లిస్ట్ అయ్యింది. ఈ ఫోను పై ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం రూ. 3,000 రూపాయల HDFC బ్యాంక్ నాన్ EMI ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 63,999 ధరకే లభిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ పై గొప్ప ఎక్స్ చేంజ్ ఆఫర్ లను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను పాత ఐఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసుకు వారు గరిష్టంగా రూ. 48,000 వరకూ ఎక్స్ చేంజ్ తగ్గింపు ను పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్రో ఫోన్ తో మేము ఎక్స్ చేంజ్ వాల్యూ చెక్ చేసినప్పుడు ఈ అమౌంట్ సూచించబడింది. అంతేకాదు, దాదాపు అన్ని పాత ఐఫోన్స్ పై గొప్ప వాల్యూ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, శామ్సంగ్ ప్రీమియం ఫోన్స్ మరియు మరికొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్స్ చేంజ్ పై కూడా ఈ ఎక్స్ చేంజ్ వాల్యూ ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ ఐఫోన్ ను చవక దరికు అందుకోవచ్చు.
ఈ యాపిల్ ఫోన్ 6.7 ఇంచ్ super Retina XDR స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ A16 Bionic చిప్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ యాపిల్ ఫోన్ Dynamic Island bubbles ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ యాపిల్ ఫోన్ లో వెనుక 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 12MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ తో 4K (at 24 fps/ 25 fps/ 30 fps/ 60 fps) వీడియోలు మరియు గొప్ప ఫోటోలు షూట్ చేయవచ్చు.