Flipkart నుంచి ఈరోజు చవక ధరకే లభిస్తున్న Apple iPhone 12

Apple iPhone 12 ఫోన్ ఈరోజు Flipkart నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ యాపిల్ ఫోన్ తయారీ ఎపుడో నిలిపి వేసినా అప్డేట్స్ మాత్రం అందుకుంటూనే వుంది. ఈ ఫోన్ గొప్ప కెమెరా మరియు గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుంది. యాపిల్ ఫోన్ కొనాలని ఉన్నా బడ్జెట్ కారణంగా కొనడానికి వీలు పడిన వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను చూడవచ్చు.

Apple iPhone 12 : ఆఫర్

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 30,999 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ఈ ఫోన్ ను Flipkart Axis Bank Credit ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.

Apple iPhone 12 : ఫీచర్స్

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.1 ఇంచ్ Super Retina XDR స్క్రీన్ ను కలిగి ఉంటుంది.ఈ స్క్రీన్ సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో గట్టిగా ఉంటుంది ఈ ఫోన్ ఫ్రేమ్ కోడోత్ అల్యూమినియం తో ఉంటుంది. ఈ ఫోన్ A14 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఐఫోన్ 12 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 12MP + 12MP కెమెరాలు ఉంటాయి మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision HDR వీడియో లను షూట్ చేసే శక్తితో ఉంటుంది మరియు గొప్ప ఫోటోలు కూడా అందిస్తుంది. ఈ ఐఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Also Read: BSNL Best Plan: యూజర్లకు లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :