మరొకసారి VIVO Z1 PRO పైన ధర తగ్గింపు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Jan 07 2020
మరొకసారి VIVO Z1 PRO పైన ధర తగ్గింపు

Explore Machine Learning with Watson on IBM Cloud

Using machine learning, discover patterns and insights within unstructured data and develop a non-biased virtual assistant

Click here to know more

HIGHLIGHTS

ఇందులో గేమింగ్ చాలా సాఫీగా సాగుతుంది మరియు PUBG గేమ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించింది.

కేవలం మిడ్ రేంజ్ ధరలో ట్రిపుల్ కెమేరా, పంచ్ హోల్ డిజైన్, బెస్ట్ ప్రాసెసర్ మరియు బెస్ట్ బ్యాటరీ వంటి అన్ని లక్షణాలతో, వివో సంస్థ తీసుకొచ్చిన VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్ పైన ముందుగా 1,000 ధర తగ్గించిన విషయం తెలిసందే. అయితే, మరొక్కసారి అధికారికంగా 1,000 రూపాయల వరకూ ధర తగ్గించింది. ఈ ఫోన్ మల్టీ టర్బో ఫీచర్లతో వస్తుంది మరియు  ఇందులో గేమింగ్ చాలా సాఫీగా సాగుతుంది మరియు PUBG గేమ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించింది. ముందుగా, 14,999 రుపాయల ప్రారంభ ధరతో లభించిన ఈ ఫోన్ యొక్క కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి.    

వివో Z1 ప్రో : కొత్త ధరలు

1. వివో Z1 ప్రో  - 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 12,990  (1,000 రూపాయల ధర తగ్గింపు)                                        

2. వివో Z1 ప్రో  - 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999  (1,000 రూపాయల ధర తగ్గింపు)

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Axis బ్యాంక్ Buzz క్రెడిట్ కార్డుతో  కొనుగోలు చేసేవారికీ 5% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది.

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది .   

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.