Google Android 11 అప్డేట్ వచ్చేసింది: ఇలా అప్డేట్ చేసుకోండి

Google Android 11 అప్డేట్ వచ్చేసింది: ఇలా అప్డేట్ చేసుకోండి
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 11 ను సెప్టెంబర్ 7 న గూగుల్ ప్రకటించింది.

Google- యొక్క కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వేచిచూస్తున్న వారికీ శుభవార్త.

ఈ అప్డేట్ Oneplus, షియోమి, రియల్మీ మరియు ఒప్పో స్మార్ట్‌ ఫోన్ ‌లకు కూడా ఇవ్వబడుతుంది.

Google- యొక్క కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వేచిచూస్తున్న వారికీ శుభవార్త. ప్రపంచంలోని ప్రసిద్ధ స్మార్ట్‌ ఫోన్స్ మరియు పరికరాల ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 11 (Android 11) అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆండ్రాయిడ్ 11 ను సెప్టెంబర్ 7 న గూగుల్ ప్రకటించింది. ఎప్పటిలాగే, గూగుల్ నుండి ఈ క్రొత్త అప్డేట్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్స్ ‌కు ఇవ్వబడుతుంది. అయితే దీనికి తోడు, ఈ అప్డేట్ Oneplus, షియోమి, రియల్మీ మరియు ఒప్పో స్మార్ట్‌ ఫోన్ ‌లకు కూడా ఇవ్వబడుతుంది. ఈ పరికరాల్లో ఇది బీటా వెర్షన్ ‌లో ఉంటుంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ డెవలపర్ ప్రివ్యూ కోసం అందుబాటులో ఉంచబడింది. అయితే, జూన్ 11 నుండి ఆండ్రాయిడ్ 11 పబ్లిక్ బీటా అప్డేట్ అందుబాటులో ఉంది. ఇది బీటాలో ఉంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో లేదు.

Android 11 అప్డేట్ అందుకోనున్న Google ఫోన్స్

ఈ గూగుల్ పిక్సెల్

ఆండ్రాయిడ్ 11 యొక్క స్థిరమైన అప్డేట్ కొన్ని గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిలో Pixel 2, Pixel 2 XL to Pixel 3, Pixel 3 XL, Pixel 3A, Pixel 3A XL and Pixel 4 మరియు Pixel 4 XL ఉన్నాయి. అయితే, పిక్సెల్ 4 మరియు పిక్సెల్ 4 XL భారత మార్కెట్లో అధికారికంగా అందుబాటులో లేవని గమనించండి.

ఆండ్రాయిడ్ 11 అందుకోనున్న ఇతర ఫోన్స్

గూగుల్ పిక్సెల్ కాకుండా OnePlus 8 మరియు OnePlus 8 Pro ఫోన్ ‌లలో అప్డేట్ అందుబాటులో ఉంటాయి.

అంతేకాకుండా, షియోమి యొక్క కొన్ని స్మార్ట్ ‌ఫోన్స్  కూడా ఆండ్రాయిడ్ 11 అప్‌ డేట్‌ ను పొందుతున్నాయి. వాటిలో Xiaomi Mi 10 మరియు Xiaomi Mi 10 Pro ఫోన్లు ఉన్నాయి.

ఒప్పో స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులు కూడా ఆండ్రాయిడ్ 11 యొక్క లేటెస్ట్ అప్డేట్ పొందబోతున్నారు. ఈ జాబితాలో Oppo Find X2, Oppo Find X2 Pro, Oppo Ace 2, Oppo Reno 3 4G, Oppo Reno 3 Pro 4G వంటి ఫోన్లు ఉన్నాయి.

Realme నుండి Realme X50 Pro ఒక మోడల్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు.

మొబైల్‌లో ఆండ్రాయిడ్ 11 ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?

Android ఫోన్ వినియోగదారులు మొదట ఫోన్ యొక్క మెను ఎంపికకు వెళ్ళాలి.

ఇక్కడ మీరు సిస్టమ్ యొక్క ఎంపికలను చూస్తారు, దాని పై క్లిక్ చేయండి.

సిస్టమ్ అప్డేట్ ఎంపిక ఇక్కడ అందుబాటులో ఉంది, ఇక్కడ అప్డేట్ ను చెక్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo