Nokia 7.2 కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్

Nokia 7.2 కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్
HIGHLIGHTS

సంస్థ ఇప్పుడు ఈ ఫోను కోసం సాఫ్ట్‌ వేర్ అప్డేట్ ను విడుదల చేసింది.

HMD గ్లోబల్, 2019 లో లాంచ్ చేసిన నోకియా 7.2 స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 కి అప్‌గ్రేడ్ చెయ్యబడింది. దీని కోసం, అప్డేట్  విడుదల చేయబడింది మరియు ఈ అప్డేటుతో ఫోను కొత్త ఫీచర్లను అందుకుంటుంది. నోకియా 7.2 గత ఏడాది సెప్టెంబర్‌ లో లాంచ్ అయ్యింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై తో వచ్చింది. సంస్థ ఇప్పుడు ఈ ఫోను కోసం సాఫ్ట్‌ వేర్ అప్డేట్ ను విడుదల చేసింది.

ఈఅప్డేట్ లో, నోకియా 7.2 కోసం ఆండ్రాయిడ్ 10 గూగుల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొత్త వెర్షన్ను అందుకుంటుంది. ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్ పొందిన ఎనిమిదవ నోకియా స్మార్ట్‌ ఫోనుగా ఇది జాబితాలో నిలుస్తుంది. ఈ జాబితాలో నోకియా 9 ప్యూర్ వ్యూ, నోకియా 8.1, నోకియా 7 ప్లస్, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 6.1 మరియు నోకియా 2.2 ఉన్నాయి. నోకియా 7.2 ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్‌ వేర్‌ లో నడుస్తుంది మరియు  స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది.

నోకియా 7.2 కోసం ఈ కొత్త అప్డేట్, ఆండ్రాయిడ్ 10 జెస్చర్ నావిగేషన్, స్మార్ట్ రిప్లై, బ్యాటరీ ప్రైవసీ కంట్రోల్, ఫోకస్ మోడ్ మరియు డిజిటల్ వెల్ బీయింగ్  వంటి ఫీచర్లను పొందుతోంది.

నోకియా 7.2 ఒక 6.3-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో విడుదల చేయబడింది, ఇది HDR 10 కి మద్దతు ఇస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కూడా ఇచ్చింది. ఈ నోకియా పరికరం ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 SoC  శక్తిని కలిగి ఉంది మరియు ఇది 6GB RAM తో జత చేయబడింది. ఈ ఫోనులో 128 జీబీ స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512 జీబీకి పెంచవచ్చు.

ఈ నోకియా 7.2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ , మూడవ కెమెరా 5 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం స్మార్ట్ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo