షావోమి ఫోల్డబుల్ ఫోన్ గురించి చెబుతున్న ఒక అధికారిక వీడియో
షావోమి యొక్క కో- ఫౌండర్ అయినటువంటి లిన్ బిన్ కంపెనీ యొక్క ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఒక డెమో వీడియోని పోస్ట్ చేసారు.
ముఖ్యాంశాలు:
Survey1. Xiaomi ఒక కొత్త వీడియోలో దాని ఫోల్డబుల్ ఫోన్ గురించి చూపిస్తుంది.
2. ఈ ఫోన్ పూర్తిగా మడతపడదు, సగంలో మడవవచ్చు, కానీ రెండు వైపులా మడతపెట్టవచ్చు.
3. ఈ ఫోల్డబుల్ డివైజ్ ఒక ఇంజనీరింగ్ నమూనాగా చెబుతున్నారు.
Xiaomi, ఒక ఫోల్డబుల్ (మడవగల) స్మార్ట్ ఫోన్ పైన పనిచేస్తున్నట్లు అంచనా మరియు సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు లిన్ బిన్ ఇప్పుడు ఈ రూమర్డ్ డివైజ్ గురించి చూపించారు. Weibo లో అప్లోడ్ చేయబడిన ఒక వీడియోలో బిన్, ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క పనితీరు మరియు ఇది ఎలా పని చేస్తుందో చూపించారు. ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ డివైజ్ అదే విధంగా పని చేస్తుందా అనే అంశంపై ఇంకా పూర్తి వివరణ లేదని గమనించండి, ఎందుకంటే వీడియోలో చూపబడినది ఒక నమూనా డివైజ్ కావచ్చు. గతంలో, షావోమి చేత తయారు చేయబదినట్లు బహిర్గతమైన ఒక ఫోల్డబుల్ ఫోన్ యొక్క వీడియోని ఇది చాల వరకు పోలివుంటుంది.
ఈ వీడియో ప్రారంభంలో, ఈ ఫోన్ పోర్ట్రైట్ స్థితిలో మొదలవుతుంది మరియు ఇది 3: 2 యాస్పెక్ట్ రేషియాతో ఉన్నట్లు అనిపిస్తుంది. మేము మాట్లాడిన ముందు వీడియోలో ల్యాండ్స్కేప్ స్థానంలో ఉంచిన ఫోన్ 4: 3 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో మొదలవుతుంది. ఈ కొత్త వీడియోలో, ఫోన్ మడవబడుతుంది కానీ అది Royole FlexPai లేదా శామ్సంగ్ యొక్క ఫోల్డబుల్ గెలాక్సీ ఫోన్ లో చూసినట్లుగా, పూర్తిగా ఫోల్డ్ చెసేటువంటిది మాత్రంకాదు. షావోమి యొక్క ఈ ఫోన్ ఒక చేతి యొక్క అరచేతిలో సరిపోయేలా రెండు మడతలతో వెనుకకు ఫోల్డ్ చేయొచ్చు మరియు పవర్ బటన్ పైన ఉంది. కానీ, ఈ స్థానాన్నిపరిగణనలోకి తీసుకోలేము, ఎందుకంటే ఇది నమూనా డివైజ్ కాబట్టి.
బిన్ ప్రకారం, ఈ వీడియోలో చూపించిన యూనిట్ ఒక ఇంజినీరింగ్ యూనిట్టుగా ఉంది. తను Weibo పోస్ట్ ఏంచెబుతుందంటే, "షావోమి యొక్క డబుల్ ఫోల్డ్ మొబైల్ ఫోన్ వస్తోంది! సౌకర్యవంతమైన ఫోల్డ్ స్క్రీన్ టెక్నాలజీ, ఫోర్-వీల్ ఫోల్డ్ షాఫ్ట్ టెక్నాలజీ, అనువైన కవర్ టెక్నాలజీ, మరియు MIUI అనుసరణ వంటి సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాత, మేము మొట్టమొదటి ఫోల్డబుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ను రూపొందించాము, ఇది ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ ఫోల్డ్ మొబైల్ ఫోనుగా ఉండనుంది. . ఈ సిమెట్రిక్ డబుల్ ఫోల్డబుల్ రూపం, సంపూర్ణంగా టాబ్లెట్ మరియు మొబైల్ ఫోన్ యొక్క అనుభవాన్ని మిళితం చేస్తుంది, ఇది ఆచరణీయ మరియు అందమైనది . ఇది ఇప్పటికీ ఇంజనీరింగ్ డివైజ్ అయినప్పటికీ, ప్రతిఒక్కరికీ చూడడానికి ఇది పంపబడుతుంది. "మేనము లిన్ ఒక ఆప్ లో నావిగేట్ చేస్తున్నట్లు మరియు ఫోన్లో ఈ ప్రక్రియలో ఫోల్డ్ చెయ్యడం చూస్తాము. అదనంగా, డిస్ప్లే మడతపెట్టిన తర్వాత, వెనుక భాగంలోని డిస్ప్లే యొక్క వెనుక అంచులు కూడా యాక్టివ్ గా ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile