అమేజాన్ ప్రైమ్ డే సేల్ : ముందెన్నడూ చూడని తక్కువ ధరలకు ‘స్మార్ట్ ఫోన్లు’
ఈ ఆఫర్లో భాగంగా, ఫోన్ ఎక్స్చేంజి పైన ఎక్స్ట్రా బోనస్, బ్యాంక్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అమేజాన్ ప్రైమ్ డే సేల్' ఇప్పుడు మనముందుకు వచ్చేసింది. ఈ నెల 15 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు జరగనున్న ఈ సేల్ ద్వారా అనేక బ్రాండ్స్ కి సంబంచిన అనేక స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ అందిచనుంది. కేవలం ఇదొక్కటే కాదు మరింకెన్నో ఆఫర్లను కూడా అందించనుంది. ఈ ఆఫర్లో భాగంగా, ఫోన్ ఎక్స్చేంజి పైన ఎక్స్ట్రా బోనస్, బ్యాంక్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Survey1. XIAOMI MI A2
షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP డ్యూయల్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ.9,999 ప్రారంభదరతో లభించనుంది.
2. HONOR 8X
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో వస్తుంది. ఇది అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ.11,999 ప్రారంభదరతో లభించనుంది.
3. NOKIA 6.1 PLUS
ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 16MP +5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ.11,999 ప్రారంభదరతో లభించనుంది.
4. Huawei P30 Lite
Huawei P30 Lite స్మార్ట్ ఫోన్ 2312 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.15 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక కిరిణ్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3340 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 24MP +8MP+2MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇది అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ.17,999 ప్రారంభదరతో లభించనుంది.
5. HUAWEI Y9 (2019)
సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 16MP +2MP డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఒక 6.5 అంగుళాల సన్నని నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఇది అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కేవలం రూ.11,999 ప్రారంభదరతో లభించనుంది.
అలాగే ఇటువంటి మరింకెన్నో స్మార్ట్ ఫోన్లు ముందెన్నడూ చూడని తక్కువ ధరలకు లభించనున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
