అమెజాన్ ప్రైమ్ డే లాంచెస్: శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ ఫస్ట్ సేల్

Updated on 22-Jul-2021
HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది

ప్రైమ్ డే సేల్ నుండి కొత్త ప్రోడక్ట్ లాంచ్

శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్

ప్రతీ సంవత్సరం మాదిరిగానే అమెజాన్  ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్ నుండి మంచి డీల్స్ మరియు ఆఫర్లను కూడా తీసుకొస్తోంది.  ప్రైమ్ డే సేల్ నుండి కొత్త ప్రోడక్ట్ లను కూడా లాంచ్ చేస్తోంది. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ ఫస్ట్ సేల్ నిర్వహించనుంది. శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ ట్రూ 48ఎంపి ట్రిపుల్ కెమెరా, 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు పెద్ద AMOLED స్క్రీన్  వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD రిజల్యూషన్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా One UI శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అతిభారీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో f/2.0  ఎపర్చరు గల 48MP ప్రధాన కెమరా  మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కి జతగా 5MP డెప్త్ సెన్సార్ ని అందించింది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 20MP సెల్ఫీ కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు మరియు కంటిన్యుయస్ షాట్స్ ఎంపికతో కూడా వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :