amazon offers Prime Day 2026 early bird big deal on Nothing Phone 3
Prime Day 2026 ఎర్లీ బర్డ్ బిగ్ డీల్: 2026 లో అమెజాన్ బిగ్ సేల్ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఒక్కరోజులో ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. అయితే, ప్రైమ్ డే 2026 సేల్ కోసం ఈరోజు నుంచి ఎర్లీ బర్డ్ డీల్స్ అండ్ ఆఫర్స్ రిలీజ్ చేయడం ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా నథింగ్ సరికొత్తగా విడుదల చేసిన ప్రీమియం ఫోన్ Nothing Phone 3 ను సేల్ నుంచి సగం ధరకే అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి ఎర్లీ బర్డ్ డీల్స్ ను లైవ్ చేసింది. ఈ సేల్ నుంచి ఈరోజు నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ ను దాదాపు సగం ధరకే సేల్ చేస్తోంది. ఇండియాలో రూ. 79,999 రూపాయల ధరతో నథింగ్ విడుదల చేసిన ఫోన్ 3 ని ఈరోజు అమెజాన్ రూ. 38,000 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 41,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఫోన్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ 40 వేల రూపాయల కంటే తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఇది నిజంగా బిగ్ డీల్ కదా. ఈ ఫోన్ ను ఆఫర్ ధరలో కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తుంటే Buy From Here లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: ఒక్క యాప్ తో ఈ-రిక్షా ఆపొచ్చా: వైరల్ అవుతున్న BAT-BMS యాప్ కథేమిటో చూద్దామా.!
నథింగ్ ఫోన్ 3 ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గా ఇండియాలో విడుదలైంది. ఇందులో, 6.67 అంగుళాల AMOLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.5 తో వస్తుంది మరియు న్యూ అప్డేట్ కూడా అందుకుంటుంది. కంపెనీ ఈ ఫోన్ తో 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆఫర్ చేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ 50MP మెయిన్ (OIS) సెన్సార్ + 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ + 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. అలాగే, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ 5150 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, మరియు కొత్త Glyph Matrix LED ఇంటర్ ఫేస్ వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.