ఇటీవల షియోమి లేటెస్ట్ గా ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన Mi 11X 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి భారీ డీల్స్ తో లభిస్తోంది. ఈ ఫోన్ పైన అందించిన 2,000 రుపాయల డిస్కౌంట్ తో పాటుగా, 3,500 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా పొందేవీలుంది. ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టింది. మరి ఈ ఫోన్ పైన అందించిన ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా..!
లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ.29,999 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, అమెజాన్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.27,999 రూపాయలకే లభిస్తోంది. అధనంగా, Citi బ్యాంక్ మరియు Axis బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ పైన రూ. 3,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పైన పూర్తిగా 5,500 రూపాయల డిస్కౌంట్ ఈ సేల్ నుండి పొందవచ్చు.
Mi 11X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వుంటుంది మరియు ఇది E4 AMOLED డిస్ప్లే. ఇది 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 7nm ఫ్యాబ్రికేషన్ ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది MIUI 12 ఆధారితంగా వస్తుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.
ఇక కెమెరాల విషయంలో, Mi 11X వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ f/1.79 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్ మరియు 5MP టెలీ మ్యాక్రో సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 20MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 4,520 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.