అమేజాన్ గ్రేట్ ఇండియా సేల్ 3 : మొదటి సారిగా ధర తగ్గినా స్మార్ట్ ఫోన్లు
Rupay డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ పేమెంట్ చెయ్యడం ద్వారా 10% అదనపు డిస్కౌంట్ ని కూడా అందిస్తోంది.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మరొకసారి మనముందుకొచ్చింది మరియు ఈ సరి కొన్ని స్మార్ట్ ఫోన్ల పైన డిస్కౌంట్లను కూడా తీసుకొచ్చింది. దీనితో పాటుగా ఏదైనా బ్యాంకు యొక్క Rupay డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ పేమెంట్ చెయ్యడం ద్వారా 10% అదనపు డిస్కౌంట్ ని కూడా అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి మొదటసారిగా ధర తగ్గిన స్మార్ట్ ఫోన్లను ఇక్కడ జాబితాగా అందిస్తున్నాను.
Survey1. Redmi Y3
ముందస్తు ధర : Rs. 9,999
షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.7,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
2. Redmi 7
ముందస్తు ధర : Rs. 7,999
షావోమి సంస్థ నుండి వచ్చినటువంటి ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా ముందుగా కేవలం రూ.9,999 ధరలో 8MP సెల్ఫీ మరియు 12MP +2MP డ్యూయల్ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 2GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. మరియు 4000 mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.6,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
3. Samsung Galaxy M 10
ముందస్తు ధర : Rs. 7,999
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో HD రిజల్యూషనుతో వస్తుంది మరియు దీనికి అదనంగా, 3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ సంస్థ యొక్క ఎక్సినోస్ 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజితో వస్తుంది మరియు దీన్ని కేవలం రూ.7,499 ధరతో కొనవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.7,499 ప్రారంభ ధరతో లభిస్తుంది.
4. Samsung Galaxy M 30
ముందస్తు ధర : Rs. 13,999
శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 30 స్మార్ట్ ఫోన్, ముందుగా మిడ్ రేంజ్ ధరలో అమ్ముడవుతుండగా, ప్రస్తుతం ఇది కేవలం రూ.9,999ప్రారంభదరతో లభిస్తుంది. ఈ ఫోన్ వెనుక 13MP +5MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
5. VIVO Y15
ముందస్తు ధర : Rs. 13,999
వివో నుండి మిడ్ రేంజ్ ధరలో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.35 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, వెనుక 13MP+8MP+2MP ట్రిపుల్ వెనుక కెమెరా మరియు ఒక 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 4GB ర్యామ్ తో జతగా వస్తుంది మరియు 64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. కేవలం రూ.12,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది.ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.6,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
6. OPPO F11 PRO
ముందస్తు ధర : Rs. 29,990
ఒప్పో నుండి ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ తో ప్రియం సెగ్మెంట్ ధరలో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, వెనుక 48MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 4000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 2.1 GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 6GB ర్యామ్ తో జతగా వస్తుంది మరియు 128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా కేవలం రూ.19,990 ప్రారంభ ధరతో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
