Amazon announced huge discount on Nothing Phone 2
Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది మరియు బడ్జెట్ ధరకే ఇప్పుడు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో రూ. 44,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 27,997 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ప్రైస్ అన్ని ప్లాట్ ఫామ్స్ పై లభించదు కేవలం అమెజాన్ నుంచి మాత్రమే లభిస్తోంది.
పైన తెలిపిన విధంగా ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 44,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈరోజు ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా రూ. 15,002 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 29,997 రూపాయల ప్రారంభ ధరతో ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఫోన్ ఫోన్ ను HDFC, Yes బ్యాంక్, Federal బ్యాంక్ మరియు RBL బ్యాంక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 27,997 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: LG 5.1 Soundbar పై అమెజాన్ బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ 2023 లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో నథింగ్ ఆఫర్ చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో అందించింది. ఈ చిప్ సెట్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫాస్ట్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ నథింగ్ ఫోన్ లో 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 10 బిట్ ప్యానల్ మరియు HDR10+ సపోర్ట్ టోడ్ పాటు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హాప్ టిక్ టచ్ మోటార్ కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ 50 MP(OIS) మరియు 50MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 32MP సెల్ఫీ కెమెరాతో కూడా అందించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, ఇన్ బిల్ట్ నథింగ్ ఫిల్టర్స్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 15W Qi వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.