alcatel launched Alcatel V3 Classic and V3 Pro two budget 5g phones in india
Alcatel V3 Series నుంచి Alcatel V3 Classic మరియు V3 Pro రెండు బడ్జెట్ ఫోన్స్ లాంచ్ చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ మొబైల్ తయారీ కంపెనీ అల్కాటెల్ దశాబ్దం తర్వాత మళ్ళి ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. అడుగుపెడుతూనే వి3 సిరీస్ నుంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందించింది. అల్కాటెల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
అల్కాటెల్ వి3 క్లాసిక్ ఫోన్ ఏఎస్ సిరీస్ లో బేసిక్ స్మార్ట్ ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ బేసిక్ (4GB + 128GB) వేరియంట్ రూ. 12,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు (6GB + 128GB) వేరియంట్ రూ. 14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందుకోవచ్చు.
అల్కాటెల్ వి3 స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB + 256GB వేరియంట్ తో మాత్రమే అందించింది. ఈ ఫోన్ ధరను రూ. 17,999 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ ను పొందవచ్చు. Axis, HDFC, ICICI మరియు SBI కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
అల్కాటెల్ వి3 క్లాసిక్ మరియు వి3 ప్రో రెండు ఫోన్లు కూడా జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
Also Read: Realme GT 7T: స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
అల్కాటెల్ వి3 క్లాసిక్ మరియు వి3 ప్రో రెండు ఫోన్లు కూడా 6.67 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ పేపర్ లాంటి ఫీల్ అందించే NXTPAPER ఫీచర్ కలిగి ఉంటాయి. అంతేకాదు, HD+ రిజల్యూషన్ మరియు 2.5D Glass కలిగి ఉంటుంది. ఈ రెండు అల్కాటెల్ స్మార్ట్ ఫోన్స్ కూడా మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తాయి. ఈ రెండు ఫోన్ లలో కూడా ఫిజికల్ ర్యామ్ తో పాటు 10GB అదనపు ర్యామ్ ఫీచర్ కూడా అందించింది.
ఈ రెండు అల్కాటెల్ బడ్జెట్ ఫోన్ లు కూడా వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. వీటిలో వి3 క్లాసిక్ ఫోన్ లో 50MP + 0.8VGA కెమెరాలు ఉంటే, వి3 ప్రో ఫోన్ మాత్రం 50MP + 5MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు ఫోన్స్ కూడా 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.
ఈ రెండు ఈ అల్కాటెల్ స్మార్ట్ ఫోన్స్ కూడా Android 15 OS ఫై నడుస్తాయి.ఈ రెండు ఫోన్స్ కూడా 5010 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్ లలో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.