ఎయిర్టెల్ కొత్త ప్లాన్ : 4 లక్షల ఇన్సూరెన్స్, డైలీ 2GB డేటా మరియు 84 రోజుల వ్యాలిడిటీ

Updated on 08-Nov-2019
HIGHLIGHTS

Rs.599 ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం మీకు మంచి లాభాలను అంధిస్తుంది.

తన వినియోగదారులకు మంచి సేవలను అందించాడని, ఎయిర్టెల్ కొన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొస్తోంది. అయితే, Rs.599 ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం మీకు మంచి లాభాలను అంధిస్తుంది. ఎయిర్టెల్ తన వినియోగదారులకు టెలికం ప్రయోజనాలతో పాటుగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని కొడా అందించదానికి తీసుకున్న చర్యల్లో భాగంగా, Bharati Axa తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం తరువాత ఒక కొత్త రూ. 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ను అన్ని ప్రయోజాలతో పాటుగా, Bharati Axa యొక్క 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజితో ప్రకటించింది.

Rs. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే,  Rs. 599 ప్రీపెయిడ్ ప్లానుతో  ఈ నెట్వర్కుకైనా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, రోజుకు 2GB హై స్పీడ్ డేటాతో వస్తుంది మరియు డైలీ 100 SMS లను కూడా అందిస్తోంది. ఇక ప్రధానంగా, అన్ని ప్రయోజాలతో పాటుగా Bharati Axa యొక్క 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజి కూడా మీకు దక్కుతుంది. అధనంగా, ఈ ప్లాన్ మీకు 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. మీరు చేసే తరువాతి రీఛార్జ్ తో ఈ ఇన్సూరెన్స్ అలాగే కొనసాగుతూ ఉంటుంది.  అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఢిల్లీ వంటి కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు రానున్నరోజుల్లో మిగిలిన అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ తీసుకురానున్నట్లు తెలిపారు.    

ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎలా పొందాలి ?

మీరు ఈ Rs. 599 ప్రీపెయిడ్ ప్లాన్ మొదటి రీఛార్జ్ చేసినతరువాత ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందడానికి, మీ వివరాలను SMS, Airtel Thanks App లేదా ఎయిర్టెల్ రిటైలర్ ద్వారా నమోదు చేసుకోవాల్సివుంటుంది. అయితే, ఈ ఇన్సూరెన్స్ కేవలం 18 నుండి 54 సంవత్సరాల వయసువారికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి ఎటువంటి మెడికల్ లేదా మాన్యువల్ పేపర్ వర్క్ లేదు కాబట్టి ఇది మీరు అప్లై చేసిన తరువాత డిజిటల్ పద్దతిలో వెంటనే మీకు అందుతుంది. అధనంగా, ఈ ఇన్సూరెన్స్ యొక్క  ఫిజికల్ పేపర్ ఎవరైనా వినియోగదారులు కోరుకుంటే, వారికీ వాళ్ళు కోరుకున్న అడ్రెస్ కి డెలివరీ కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.                         

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :