48MP మెగా కెమేరా ఫోన్ REDMI NOTE 7 PRO మరొక ఫ్లాష్ సేల్

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసేవారికీ జియో భాగస్వామ్యంతో 1140GB అదనపు డేటాని అందుకునే అవకాశం లభిస్తుంది.

ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది.

48MP మెగా కెమేరా ఫోన్ REDMI NOTE 7 PRO మరొక ఫ్లాష్ సేల్

కేవలం బడ్జెట్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా ఒక Sony IMX586 సెన్సారుతో షావోమి తీసుకొచ్చినటువంటి రెడ్మి నోట్ 7 ప్రో, ఈ ధరలో కెమేరా పరంగా బెస్ట్ స్మార్ట్ ఫోనుగా అందరి మన్ననలను అందుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి బెస్ట్ ఆఫర్లతో REDMI NOTE 7 PRO  మరొక ఫ్లాష్ సేల్ జరగనుంది. ముందుగా జరిగిన అన్ని సేల్స్ నుండి గణనీయమైన అమ్మకాలను సాధించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 7 ప్రో : ధర మరియు ఆఫర్లు

1. రెడ్మి నోట్ 7 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999

2. రెడ్మి నోట్ 7 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999

ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసేవారికీ జియో భాగస్వామ్యంతో 1140GB అదనపు డేటాని అందుకునే అవకాశం లభిస్తుంది. అధనంగా Flipkart నుండి  ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% తక్షణ డిస్కౌంట్ మరియు Axis బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% డిస్కౌంట్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి.

రెడ్మి నోట్ 7 ప్రో  ప్రత్యేకతలు  

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.  ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది.

 ఇందులో అతితక్కువ 1.6um 4-ఇన్-1 సూపర్ పిక్సెల్స్ తో అద్భుతంగా ఉంటుంది, ఈ కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది.  ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణంతో ఉంటాయి, సామాన్యంగా ప్రస్తుత ఫోనులో ఇది కేవలం 4MB నుండి 6MB మధ్య ఉంటుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo