2026 Upcoming Phones: కొత్త ఏడాదిలో ముందుగా లాంచ్ అవుతున్న ఫోన్స్ లిస్ట్.!

Updated on 25-Dec-2025
HIGHLIGHTS

కొత్త ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్‌లో ముందంజలో నిలవడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి

ఇప్పటికే Realme మరియు Redmi రెండు సంస్థలు కూడా కొత్త సంవత్సర కొత్త స్మార్ట్‌ ఫోన్ల లాంచ్ డేట్స్‌ను అధికారికంగా ప్రకటించాయి

Oppo తన ప్రీమియం సిరీస్‌కు సంబంధించి టీజింగ్ ప్రారంభించింది

2026 Upcoming Phones: 2026 సంవత్సరం స్వాగతానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే, స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు కొత్త ఏడాది ప్రారంభంలోనే కొత్త ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్‌లో ముందంజలో నిలవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే Realme మరియు Redmi రెండు సంస్థలు కూడా కొత్త సంవత్సరం మొదట్లో విడుదల చేయనున్న తమ కొత్త స్మార్ట్‌ ఫోన్ల లాంచ్ డేట్స్‌ ను అధికారికంగా ప్రకటించాయి. మరోవైపు, Oppo తన ప్రీమియం సిరీస్‌కు సంబంధించి టీజింగ్ ప్రారంభించింది.

ఈసారి దాదాపు అన్ని కంపెనీలు కూడా కొత్త తరం ప్రాసెసర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు, అలాగే శక్తివంతమైన కెమెరా టెక్నాలజీతో కూడిన ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు స్పష్టంగా చెబుతున్నాయి. మరి, 2026 లో ముందుగా రాబోయే స్మార్ట్‌ ఫోన్లు మరియు వాటి ముఖ్యమైన ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకుందామా.

2026 Upcoming Phones:

రియల్‌మీ అందరి కంటే ముందుగా తన కొత్త ఫోన్ లాంచ్ గురించి డేట్ అనౌన్స్ చేసింది. రియల్‌మీ 16 ప్రో సిరీస్ మరియు మరో రెండు డివైజెస్ లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ ఈ వరుసలో రెండో స్థానంలో ఉంటుంది. రెడ్ మీ నోట్ 15 సిరీస్ మరియు మరో డివైజ్ ను వచ్చే నెలలో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఇక ఒప్పో విషయానికి వస్తే, ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన రెనో కొత్త సిరీస్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. రియల్‌మీ, రెడ్ మీ మరియు ఒప్పో నుంచి వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కాబోతున్న ఆ ఫోన్స్ వివరాలు ఇప్పుడు వరుసగా చూద్దాం.

Realme

2026 జనవరి 6న రియల్‌మీ 16 ప్రో సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఇందులో, రియల్‌మీ 16 ప్రో మరియు రియల్‌మీ 16 ప్రో ప్లస్ రెండు ఫోన్లు ఉన్నాయి. ఇది కాకుండా రియల్‌మీ పాడ్ 2 మరియు రియల్‌మీ ఎయిర్ బడ్స్ ఎయిర్ ఐ ఇయర్ బడ్స్ ను కూడా అదే రోజు విడుదల చేస్తుంది. అంటే, కొత్త ఏడాది ఆదిలోనే నాలుగు డివైజెస్ ను ఇండియాలో రియల్‌మీ లాంచ్ చేస్తుంది.

రియల్‌మీ లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ ఫోన్స్ మరియు టాబ్లెట్ రెండు కూడా బిగ్ బ్యాటరీ, పవర్ ఫుల్ కెమెరాలు మరియు శక్తివంతమైన AI సపోర్ట్ తో లాంచ్ అవుతున్నాయని కంపెనీ ఇప్పటికే టీజర్ ద్వారా వెల్లడించింది.

Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం 12 వేల ధరలో ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

Redmi

రెడ్ మీ కూడా అదే 2026 జనవరి 6వ తేదీన రెడ్ మీ నోట్ 15 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, అదే రోజు రెడ్ మీ పాడ్ 2 ప్రో 5జి టాబ్లెట్ కూడా లాంచ్ చేస్తుంది. అయితే, ఇదే రోజు మరో ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ ఫోన్ అండ్ పాడ్ రెండు కూడా బిగ్ బ్యాటరీ మరియు శక్తివంతమైన చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నాయని రెడ్ మీ చెబుతోంది.

Oppo

ఇక ఒప్పో విషయానికి వస్తే, ఒప్పో రెనో 15 సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఇందులో ఒప్పో రెనో 15 మరియు ఒప్పో రెనో 15 ప్రో రెండు ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్స్ ను సరికొత్త డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తునట్లు ఒప్పో టీజింగ్ స్టార్ట్ చేసింది. అయితే, ఈ సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్స్ 2026 జనవరి నెలలో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నాము.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :