10.or పోకెట్ – ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ “10.or D2” ని రూ . 6,999 ప్రారంభదరగా అమెజాన్ ద్వారా విడుదల చేయనుంది

HIGHLIGHTS

ఈ "10.or D2" స్మార్ట్ ఫోన్ ఆగష్టు 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు (మెంబెర్స్) దీనిని కొనడానికి మిగిలిన వారికంటే 24 గంటల ముందే యాక్సిస్ ను పొందుతారు.

10.or పోకెట్ – ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ “10.or D2” ని రూ . 6,999 ప్రారంభదరగా అమెజాన్ ద్వారా విడుదల చేయనుంది

10.or ( టెనార్ గా పిలిచే) 'అమెజాన్ కోసం రూపొందించిన' ప్రోగ్రామ్ లో భాగంగా Amazon.in పై వేల వినియోగదారుల రివ్యూస్ నుండి మరియు తెలిపిన మెళకువల ప్రతిస్పందనను ఉపయోగించి నిర్మించిన 10.2 D2 స్మార్ట్ ఫోన్ ని ప్రారంభించింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 2జీబీ ర్యామ్ మరియు 16జీబీ స్టోరేజి ఫోన్ రూ .6,999 కి , 3 జీబి ర్యామ్ మరియు 32 జీబి స్టోరేజి రూ . 7,999 రూపాయల ధరతో అందిస్తుంది.ఈ  రెండు ఫోన్లు కూడా 128జీబీ వరకు విస్తరించవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆగస్టు 28 న మధ్యాహ్నం నుంచి "10.or D2"  అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 27 న ప్రైమ్ సభ్యులు 12pm నుంచి ప్రారంభ ప్రవేశం పొందుతారు. ఈ రోజు నుంచి వినియోగదారులు అమ్మకం గురించి ప్రకటనలను పొందేందుకు నమోదు చేసుకోవచ్చు.  10.or D2  962 వేర్వేరు నాణ్యతా పరీక్షలలో పాసయినట్లు 10.or పేర్కొంది. "10.or D2 అనేది అమెజాన్.ఇన్లో వినియోగదారులతో మాకున్న అనుచిత సంభందం ద్వారా ఉత్పత్తి చేయబడినది ఇది అంతర్దృష్టులతో ప్రపంచ స్థాయి తయారీని మరియు అధిక విశ్వసనీయత ఇంకా నాణ్యత ప్రమాణాలతో నిర్మించిన 'అమెజాన్ కోసం రూపొందించిన' ఒక డివైజ్. మా భాగస్వామి హువాక్విన్ టెక్నాలజీస్, దాని పూర్వ 10.or D నుండి అనేక అధ్యయనాలతో, అమెజాన్ ఇండియా వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ రెండవ తరం స్మార్ట్ ఫోన్నీ తయారు చేసింది, " అని అమెజాన్ ఇండియా యొక్క డైరెక్టర్ ఆఫ్ కేటగిరీ మానేజ్మెంట్ అయిన, నూర్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10.or D2  ఒక 5.45-అంగుళాల HD + స్క్రీన్ 18: 9 డిస్ప్లేతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్లో 1.4 GHz వద్ద క్లాక్ చేయబడినది, ఇది మెరుగైన మల్టీ – టాస్కింగ్ అనుభవాన్ని అందించడానికి ఆప్టిమైజ్ చేసిన సాఫ్ట్ వేర్ తో ఇవ్వబడింది. ఇది "అవినిక్ ధ్వని అల్గోరిథం" ను కలిగి ఉంది, ఇది కాల్స్ మరియు మ్యూజిక్  కోసం ఉన్నతమైన ఆడియో నాణ్యతను అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తో పాటు 3200 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ డివైజ్ ద్వారా 70 గంటల MP3 ప్లేబ్యాక్ సమయాన్ని, 19 గంటల టాక్ టైమ్ వరకు లేదా ఇంటర్నెట్లో 10 గంటలు వరకు వినియోగదారులకు ఇవ్వగలమని కంపెనీ పేర్కొంది. కెమెరా విభాగంలో, వెనుక ఒక LED ఫ్లాష్ తో 13ఎంపీ కెమెరా ఉంది, ముందు షూటర్ 5ఎంపీ లెన్స్ కలిగి ఉంటుంది. అమెజాన్ షాపింగ్, కిండ్లీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు అలెక్సా ముందు ప్రీ లోడెడ్ గా అందించబడ్డాయి.   బ్లాక్ అండ్ గ్లో గోల్డ్ బియాండ్ లాంటి రెండు రంగుల వేరియంట్లలో  ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile