ఒక డ్యూయల్ స్క్రీన్ PC గా మైక్రో సాఫ్ట్ సెంటారస్ వచ్చే ఏడాది విడుదల కావచ్చు

ఒక డ్యూయల్ స్క్రీన్ PC గా మైక్రో సాఫ్ట్ సెంటారస్ వచ్చే ఏడాది విడుదల కావచ్చు
HIGHLIGHTS

మైక్రో సాఫ్ట్ ఎల్లప్పుడు ప్రత్యేక హార్డ్ వేర్ డిజైనుల కోసం ప్రయోగాలను చేయడంలో ముందుంటుంది.

ల్యాప్ టాప్ల యొక్క సాధారణ రూపకల్పన కేటగిరీ  మొదటి నుండి ఉనికిలో ఉంది, రూపకల్పనకు అనేక ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. అయితే, లెనోవో యొక్క Yoga Book తో రెండు డిస్ప్లేలు కలిగిన (మరియు ఏ కీబోర్డు లేని)  ల్యాప్ టాప్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ఆ సమయంలో, ఆ పరికరం చాలా బాగా రాలేదు. అయినప్పటికీ, విండోస్ సెంట్రల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డ్యూయల్-స్క్రీన్ PC యొక్క సొంత వెర్షన్నుకోసం పని చేస్తునట్లు నివేదించింది, దీనిని   సర్ఫేస్ సెంటారస్ అని నామకర్మ చేసినట్లు చెబుతోంది.

విండోస్ సెంట్రల్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ సెంటారస్ అభివృద్ధి కోసం ఇంటెల్ తో కలిసి పనిచేస్తోంది. యాదృచ్ఛికంగా, మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్న మొట్టమొదటి డ్యూయల్ డిస్ప్లే పరికరం ఇది కాదు, నిజానికి ముందుగా రద్దు చేసిన ప్రాజెక్ట్ ఆన్డ్రోమెడ మొట్టమొదటిది. మైక్రోసాఫ్ట్ కూడా ఒక డిజిటల్ జర్నల్ను రెండు డిస్ప్లేలతో 2010 నాటికి తీసుకువచ్చింది, కానీ ప్రాజెక్ట్ రద్దు చేయబడింది. నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం డ్యూయల్ స్క్రీన్ 2-ఇన్ -1 యంత్రాన్ని 2019 కల్లా   విడుదలచేయాలని యోచిస్తోంది. ఆసక్తికరంగా, ఈ పరికరం విండోస్ ఆపరేటింగ్ సిస్టం యొక్క సాంప్రదాయిక వెర్షన్ను అమలు చేయకపోవచ్చు కానీ విండోస్ కోర్ OS ను అమలు చేయగలదు. Windows Core OS అనేది ప్రామాణిక ఫార్మాట్ ఫ్యాక్టర్లో లేని పరికరాల్లో Microsoft ఉపయోగించే ఒక మాడ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్.

మైక్రోసాఫ్ట్ కొంతకాలం ప్రత్యేకమైన ఫ్యాక్టర్లలో వేలుపెట్టింది, సర్ ఫేస్ ప్రో వారి విపరీతమైన ప్రయోగాల ఉదాహరణలలో ఒకటి. మరలా తిరిగి Windows ఫోన్ యొక్క రోజుల్లో, ప్రాజెక్ట్ ఆన్డ్రోమెడ మైక్రోసాఫ్ట్ నుండి వచ్చే తదుపరి పెద్ద పురోభివృద్ధి అని పుకారు వచ్చింది, కాని ఈ ప్రాజెక్టు చివరకు రద్దయింది. ఇప్పుడు సర్ ఫేస్ సెంటారస్ ప్రాజెక్ట్ అండ్రోమెడ యొక్క రీబ్రాండింగ్ కావచ్చు అనుకుంటున్నారు. కానీ విండోస్ సెంట్రల్ రిపోర్ట్ ప్రకారం, సర్ ఫేస్ సెంటారస్ అనేది ప్రాజెక్ట్ ఆన్డ్రోమెడ నుండి వేరొక పరికరం, ఇది స్మార్ట్ ఫోనుగా భావించబడింది. ఈ సర్ ఫేస్ సెంటారస్ ఎక్కువగా ల్యాప్ టాప్ -సెంట్రిక్ పరికరం వలె ఉంది, కానీ మైక్రోసాఫ్ట్ దీని గురించి పూర్తిగా అధికారిక ప్రకటనలను విడుదల చేసేంతవరకు, మనకు దీనిగురించి తెలియదు. అయితే, ఇలాంటి ప్రయోగాల మీద కేవలం మైక్రోసాఫ్ట్ ఒక్కటే  పని చేయటంలేదు. అసూస్ కూడా ప్రాజెక్ట్ ప్రికాగ్ ని గురించి చూపిస్తోంది, ఇందులో కంపెనీ యొక్క ప్రయోగాత్మక సన్నని మరియు తేలికైన ల్యాప్ టాప్  చూపించింది, ఇది మరొక డిస్ప్లే కోసం కీబోర్డును దాటవేసింది. మేము ఈ సంవత్సరం ప్రారంభంలో Computex లో  ఈ ప్రాజెక్ట్ ప్రెగ్గ్ యొక్క ఒక నమూనాని మా చేతులోకి తీసుకుని చూసాం. మైక్రోసాఫ్ట్ నిజానికి డ్యూయల్ డిస్ప్లే ల్యాప్ టాప్ ని  ప్రారంభించినట్లయితే, అది కొత్త తరగతి పరికరానికి ప్రామాణికం అని మేము అంచనా వేస్తున్నాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo