CES 2024: టాప్ టెక్ షో నుండి ప్రదర్శించిన మూడు కొత్త గేమింగ్ ల్యాప్ టాప్స్.!

CES 2024: టాప్ టెక్ షో నుండి ప్రదర్శించిన మూడు కొత్త గేమింగ్ ల్యాప్ టాప్స్.!
HIGHLIGHTS

CES 2024 ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో

ఈ అతిపెద్ద టెక్ షో నుండి గేమింగ్ ల్యాప్ టాప్స్ రివీల్ చేయబడ్డాయి

ఈ టెక్ షో USA లోని లాస్ వేగాస్ లో జరిగింది

CES 2024: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో గా చెప్పబడే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఈఎస్) ను అనేక బ్రాండ్స్ నుండు చాలా ప్రోడక్ట్స్ ప్రదర్శించ బడ్డాయి. ఈ అతిపెద్ద టెక్ షో నుండి ఈరోజు ఒక మూడు టాప్ గేమింగ్ ల్యాప్ టాప్స్ రివీల్ చేయబడ్డాయి. ఈ టెక్ షో USA లోని లాస్ వేగాస్ లో జరిగింది మరియు ఈరోజుతో ముగుస్తుంది. ఈ షో నుండి అందించబడిన ఆ మూడు గేమింగ్ హైఎండ్ ల్యాప్ టాప్స్ మరియు వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.

HP Omen Transcend 14

సిఇఎస్ 2024 నుండి ఈ HP Omen Transcend 14 గేమింగ్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్ టాప్ గేమింగ్ మరియు క్రియేటివ్ టాస్క్ ల రెండింటి కలయికగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ సన్నని బాడీతో అందంగా కనిపిస్తోంది. ఇందులో, 14 ఇంచ్ OLED డిస్ప్లే 2.8K రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. మెరుగైన IMAX సర్టిఫైడ్ OLED డిస్ప్లేని ఈ ల్యాప్ లో వుంది.

CES 2024: HP Omen Transcend 14

ఈ HP ల్యాప్ టాప్ కేవలం 1.6 కేజీ ల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 11.5 గంటల బ్యాకప్ అందించగల బ్యాటరీని type-C PD 140W అడాప్టర్ సపోర్ట్ తో కలిగి వుంది. ఇది Intel Ultra 9 185H ప్రోసెసర్ మరియు NVIDIA GeForce RTX 4070 GPU తో పని చేస్తుంది.

Also Read : OPPO Reno 11 5G: 32MP టెలిఫోటో కెమేరా సెటప్ తో వచ్చింది.!

Alienware M16 and M18

ఏలియన్ వేర్ M16 and M18 ల్యాప్ టాప్ లను ఈ షో నుండి రివీల్ చేసింది. ముందుగా Alienware M16 గురించి చూస్తే, ఇది కొత్త లుక్ తో అప్గ్రేడ్ చెయ్యబడింది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ఇప్పుడు థర్మల్ సొల్యూషన్ ల కోసం 43% అధిక ఎయిర్ ఫ్లో తో ఉన్నట్లు Dell తెలిపింది. ఈ ల్యాప్ టాప్ 16 ఇంచ్ డిస్ప్లే Intel Core Ultra H Series ప్రోసెసర్ మరియు Nvidia RTX 4070 GPU లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ను $1,649.99 ధరతో లాంచ్ చేసింది.

CES 2024: Alienware M16 and M18

ఇక M18 ల్యాప్ టాప్ విషయానికి వస్తే, ఇది 14th Gen Intel Core i9-14900HX ప్రోసెసర్ జతగా Nvidia RTX 4090 GPU తో కలిగి వుంది. ఈ ల్యాప్ టాప్ డిస్ప్లే కూడా 16 ఇంచ్ తో ఉంటుంది మరియు $1,899.99 ధరతో లాంచ్ చెయ్యబడింది.

Acer Predator Helios Neo

ఇక చివరిగా మూడవ ల్యాప్ టాప్ విషయానికి వస్తే, Acer Predator Helios Neo ని సిఇఎస్ 2024 నుండి ఏసర్ ఆవిష్కరించింది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ Intel Core 14th gen ప్రోసెసర్ జతగా Nvidia GeForce RTX 40 Series GPU తో కలిగి వుంది. ఈ ఏసర్ ల్యాప్ టాప్ 16 ఇంచ్ మరియు 18 ఇంచ్ రెండు డిస్ప్లే సైజులలో లభిస్తుంది. ఇది 250 Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగల Mini LED IPS ప్యానల్.

CES 2024: Acer Predator Helios Neo

ఈ ఏసర్ గేమింగ్ ల్యాప్ టాప్ 32GB RAM మరియు 2TB స్టోరేజ్ లతో వచ్చింది. ఇది ఫుల్ రేంజ్ పోర్ట్ లను కలిగి వుంది. ఇందులో, థండర్ బోల్ట్ 4 పోర్ట్స్ తో 2 USB Type-C పోర్ట్స్, HDMI 2.1 మరియు మైక్రో SD కార్డు రీడర్స్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo