Youtube షాకింగ్ న్యూస్.. ఇక నుండి ఆ వీడియోలు ప్రీమియం సభ్యులకు మాత్రమే..!

Youtube షాకింగ్ న్యూస్.. ఇక నుండి ఆ వీడియోలు ప్రీమియం సభ్యులకు మాత్రమే..!
HIGHLIGHTS

Youtube గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది

యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోలను వీక్షించలేరు

కేవలం Premium సభ్యులకు మాత్రమే అనుమతి

ప్రపంచ అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ Youtube గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ అందరికి అన్ని వీడియోలను చూసేందుకు యాక్సెస్ అందించిన యూట్యూబ్, ఇక నుండి మ్యూజిక్ వీడియోలను చూడడానికి కేవలం Premium సభ్యులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. అంటే, ప్రైమ్ సభ్యలు కానివారు యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోలను వీక్షించలేరు.  ఇది ఖచ్చితంగా చాలా మందికి మిగుండు పడని విషయంగా ఉంటుంది.     

వాస్తవానికి, మొదట్లో YouTube అనేది మ్యూజిక్ వీడియోలను చూడటానికి లేదా ఇష్టమైన ట్యూన్‌లను వినడానికి వేదికగా ఉండేది. అయితే, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ నుండి వచ్చిచేరిన టన్నుల కొద్దీ వీడియోల తరువాత అని విధాలైన ఎంటర్టైనింగ్ ప్లాట్ఫారంగా నిలిచే ఏకైక  స్థలంగా మారింది. దీనికి తోడు, ప్రజలు OTT ప్లాట్‌ఫారమ్‌ లపైన కంటెంట్‌ కోసం చెల్లించడానికి కూడా సిద్ధమవుతుండం చూసిన తరువాత యూట్యూబ్ కూడా తన Premium ను ప్రారంభిచింది. దీని కోసం తన YouTube Premium మెంబర్స్ కోసం యాడ్స్ ను కూడా తొలగించింది.

Youtube లో ఉచితంగా ఏ వీడియోలను చూడవచ్చు?

ప్రీమియం లేని వినియోగదారులు మ్యూజిక్ వీడియోలను చూడటానికి YouTube అనుమతించదు. అయితే, ఈ చర్యను ఒకేసారిగా కాకుండా కొద్దీ కొద్దిగా పరిమితం చేస్తుంది. అంటే, ముందుగా యూట్యూబ్ లో అందరికి అందుబాటులో ఫీచర్లను పరిమితం చేసింది. ప్రీమియం సభ్యులు వారికీ డిమాండ్ మేరకు అన్ని పాటలను, మ్యూజిక్ వీడియోలను ప్లే చెయవచ్చు. ఉచిత సబ్యులకు ఆన్ డిమాండ్ మ్యూజిక్ ని అందించే అవకాశం ఉండదు.

ఇది మాత్రమే కాదు, మ్యూజిక్ వీడియోలకు యాక్సెస్‌ని పరిమితం చేయాలని YouTube కనుక ప్లాన్ చేసినట్లయితే, పేరుకలిగిన  బిగ్-నేమ్   లేబుల్స్ ద్వారా నిర్వహించబడే ఛానెల్స్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గడాన్ని మనం చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo