ఈ లక్షణాలు మీ ఫోన్ లో కనిపిస్తున్నాయా..మీ ఫోన్ హ్యాక్ అయినట్లే.!

HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ లక్ష్యంగా చాలా హ్యాకర్లు కొత్త కొత్త వైరస్ లను సృష్టిస్తున్నారు

స్మార్ట్ ఫోన్ లు ప్రస్తుతం అన్ని పనులకు ప్రధాన వనరుగా మారిపోయాయి

ఈ లక్షణాలు లేదా గుర్తులు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు

ఈ లక్షణాలు మీ ఫోన్ లో కనిపిస్తున్నాయా..మీ ఫోన్ హ్యాక్ అయినట్లే.!

స్మార్ట్ ఫోన్ లు ప్రస్తుతం అన్ని పనులకు ప్రధాన వనరుగా మారిపోయాయి. అందుకే, స్మార్ట్ ఫోన్ లక్ష్యంగా చాలా హ్యాకర్లు కొత్త కొత్త వైరస్ లను సృష్టిస్తున్నారు. చాలా సులభంగా ఆన్లైన్లో పనులను నిర్వహించడానికి ప్రజలు స్మార్ట్ ఫోన్ లను ఆశ్రయించడానికే అలవాటు పడిపోయారు.  ఇదే అదునుగా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి యాడ్స్ ను అడ్వార్టైజ్ చేయడం లేదా యూజర్ల పర్సనల్ డేటాను తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు.                     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీ ఫోన్ లో సాధారంగా కాకుండా ఇక్కడ సూచించిన లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, మీరు మీ ఫోన్ గురించి అనుమానం వ్యక్తం చేయవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటో చూద్దామా.

ముందుగా, మీ హ్యాక్ అయినట్లయితే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది. అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అలాగే, మీరు వాడకుండానే మీ డేటా అయిపోతుంది లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, బాగా వేగంగా పనిచేసే మీ ఫోన్ స్పీడ్ సడన్ గా పడిపోతుంది. అంటే, మీ ఫోన్ బాగా స్లో అయిపోతుంది. మీ ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు లేదా గుర్తులు మీకు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు.

అయితే, ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్ లలో చూసే సాధారణ సమస్యగా మీరు గుర్తించవచ్చు. అయితే, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ ఫోన్లలో మీరు సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు సందేహపడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo