మీ దగ్గర ఓటరు కార్డు లేదా, అయినా సరే మీరు ఓటు వేయవచ్చు! ఎలాగో తెలుసా?

Updated on 11-Mar-2019
HIGHLIGHTS

మీ ఓటరు కార్డు పోగొట్టుకున్నా, లేదా కనిపించక పోయినా కూడా మీరు ఓటువేయవచ్చు.

ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. అయితే, కొంతమంది ఓటర్లకు వారి ఓటరు కార్డుకు సంబంధించిన అనేక అనుమానాలు వున్నాయి. అదేంటి, అనుమానాలు ఏంటి అనుకుంటున్నారా? ఎవరికీ అనుమానాలు ? అని మీరు అనుకోవచ్చు. మీకు కాకపోయినా, కొంతమంది తమ ఓటరు కార్డును వెతికే పనిలో వున్నారు. ఎందుకంటారా, అనుకోకుండా జారవిడుచుకున్నవారు లేదా పోగొట్టుకున్నవారు లేదా ఎక్కడో పెట్టి మర్చి పోయిన వారు ఇలా చాల మంది, ఓటరు కార్డు లేకుండా ఎలా తమ ఓటు వేయాలని తర్జన భర్జన పడుతుంటారు, వారికోసమే ఈ గుడ్ న్యూస్. ఇక విషయానికి వస్తే, ప్రస్తుతం  ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఓటరు కార్డు లేకున్నా సరే కొన్ని ఇతర ప్రభుత్వ ఆమోదిత ID కార్డును, చూపించి ఓటు వెయ్యవచ్చు .

వాస్తవానికి, ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓటరుకు అందించినటువంటి ఆమోదిత ఎలెక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC) అందరికి (Voter ID కార్డుగా సుపరిచితం) అవసరం. ఈ ఓటరు కార్డు లేకుండా ఓటు వేయడానికి పోలింగ్ బూతు లోపలికి అనుమతించరు. కానీ, ఇప్పుడు మీ ఓటరు కార్డు లేకున్నా సరే, ఈ కొత్త నిర్ణయంతో ఈ  క్రింది సూచించిన పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు.

ఈ పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు

1. ఆధార్ కార్డు

2. PAN కార్డు

3. డ్రైవింగ్ లైసెన్స్

4. బ్యాంకు అకౌంట్/ పోస్ట్ ఆఫీస్ యొక్క ఫోటో కూడిన ఆమోదిత పాస్ బుక్

5. ఫొటో తో కూడిన పెన్షన్ పత్రం

6.  MPs/MLAs/MLCs కోసం ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ID కార్డులు

7. NPR లో భాగంగా RGI ఇచ్చిన స్మార్ట్ కార్డు

8. కేంద్ర మరియు రాష్ట్ర ఉద్యోగులు మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల యొక్క ఆమోదిత సర్వీస్ ID కార్డు

9.  పాస్ పోర్ట్      

10. కార్మిక మంత్రిత్వ శాఖ పధకం నుండి పొందిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు                                                   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :