మీ కొత్త మొబైల్ నంబరును బ్యాంక్ ఖాతాతో అప్డేట్ చేయాలా?

మీ కొత్త మొబైల్ నంబరును బ్యాంక్ ఖాతాతో అప్డేట్ చేయాలా?
HIGHLIGHTS

ఆన్లైన్లో చాలా సులభంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకొని అప్డేట్ చేసుకోవచ్చు.

మీ బ్యాంక్ పనులను బ్యాంకుకు వెళ్లకుండానే, మీరు బ్యాంక్ లైన్ లో నిలబడకుండానే చెయ్యొచ్చు. అంతేకాదు, మీరు బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం కూడా లేదు. ఇందులో ముఖ్యంగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మరుకాచుకోవాలంటే చాల సులభంగా ఆన్లైన్లో మార్చవచ్చు.  నేటి కాలంలో అందరూ స్మార్ట్  ఫోన్ వాడకం మరియు టెలికం సంస్థలు అందిస్తున్న ఆఫర్ల కారణంగా మన దేశంలో ఎక్కువ శాతం ఈ సేవ అందుబాట్లోకి వచ్చింది. ఈ సేవలతో అనేకమైన పనులను ఆన్లైన్ లోనే నిర్వహించవచ్చు. మీరు ఎలా చెయ్యవచ్చు, అనేవిషయాన్ని కూలంకుషంగా వివరించాము. ఈ క్రింద తెలిపిన దశలను అనుసరించినట్లయితే, బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్లైన్లో  చాలా సులభంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకొని అప్డేట్ చేసుకోవచ్చు.   

ఇంటర్నెట్ బ్యాంకింగ్

మీరు ఈ మొదటి పద్ధతి ద్వారా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే, మీరు సులభంగా ఈ క్రింది దశలను ఎంచుకోవడం ద్వారా దీన్ని సులభముగా చేయవచ్చు.

1. దీని కోసం మీరు మొదట ఆన్లైన్ బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్లాలి

2. దీనితో పాటు, మీ ఆన్ లైన్ SBA  ఖాతాకు లాగిన్ అవ్వాలి

3. ఇప్పుడు ఒక కొత్త పేజీ తెరవబడుతుంది, ఇక్కడ మీరు ఖాతా మరియు ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి

4. ఇప్పుడు మీరు డౌన్ డ్రాప్ మరియు ప్రొఫైల్ క్లిక్ కోసం వెళ్ళాలి

5. ఈ తరువాత మరొక కొత్త పేజీ తెరవబడుతుంది, అక్కడ మీరు వ్యక్తిగత వివరాలు / మొబైల్ పై క్లిక్ చేయాలి

6. ఒక కొత్త పేజీ మీ వ్యక్తిగత వివరాల కోసం తెరవబడుతుంది, మీరు మీ ప్రొఫైల్ పాస్వర్డును ఎంటర్ చేసి కొనసాగించాలి

7. మీరు పాస్వర్డును సబ్మీట్ చేసిన వెంటనే,  మీరు మీ పేరు, ఇమెయిల్ ఐడి మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కనిపిస్థాయి

8. ఇప్పుడు మీరు ఇక్కడ మీ మార్చాలనుకున్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి .

9. అయితే, ముందు మీరు ఒక OTP అందుకుంటారు , ఇక్కడ మీరు ఈ OTP ఎంటర్ చెయ్యాలి, ఇది ఆమోదం పొందిన తర్వాత మీరు మీ మొబైల్ నంబర్             మార్పును చూస్తారు

10. ఇక వెంటనే మీ కొత్త మొబైల్ నంబర్ నమోదవుతుంది.

అలాగే, మీరు ATM మిషన్ నుండి కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకోవచ్చు

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo