షావోమి ట్రిమ్మింగ్ మిషన్ సరికొత్త ఫీచర్లతో విడుదలయ్యింది

షావోమి ట్రిమ్మింగ్ మిషన్ సరికొత్త ఫీచర్లతో విడుదలయ్యింది
HIGHLIGHTS

కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 10 నిముషాల వరకూ వాడుకోవచ్చు.

ఇది IPX7 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది.

నీటిలో తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

నిన్నటివరకూ టీజింగులతో అదరగొట్టిన షావోమి యొక్క ట్రిమ్మింగ్ మిషన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి, ఇండియాలో విడుదలయినది. సంస్థ యొక్క వెబ్ పేజీలో ఈ లాంచ్ కార్యక్రమాన్ని అందించింది, షావోమి. ఇందులో సంస్థ యోక్క వైస్ ప్రసిడెంట్ మరియు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి, మనూ కుమార్ జైన్, ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసారు. ఇది ఈ రోజు నుండి ప్రీ ఆర్డర్లను చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. అలాగే, 27 జూన్ నుండి అమెజాన్ మరియు మీ హోమ్ లలో లభిస్తుంది.     

ఇక ఈ ట్రిమ్మింగ్ మిషన్ యొక్క విశేషాల్లోకి వెళితే, ఇది 40 రకాలైన పొడవును ఎడ్జెస్టుమెంట్ చేసుకునేలా అందించినట్లు షావోమి పేర్కొంది. అలాగే, ఇందులో అందించిన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 10 నిముషాల వరకూ వాడుకోవచ్చు. అయితే, పూర్తి ఛార్జింగుతో అత్యధికంగా 90 నిముషాల వరకూ వాడుకోవచ్చని ఈ లంచ్ ఈవెంట్లో తెలియచేశారు.

ముఖ్యంగా, ఇది డ్యూరబిలిటీ విషయంలో చాల మన్నికైనదని తెలుస్తోంది. గట్టిదనంలోనే కాకుండా నీటిలో కూడా వాడుకునేలా దీన్ని అందించింది. ఇది IPX7 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి నీటిలో తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడడానికి చాలా స్టైలిష్ డిజైనుతో కనిపిస్తుంది మరియు ఒక్క చేత్తో కావాల్సిన పాయింట్స్ సెట్ చేసుకునేలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ట్రిమ్మర్ ధరను రూ.1,199 రూపాయలుగా ప్రకటించింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo