డిసెంబర్ నెలలో ఈ Xiaomi ఫోన్స్ వున్న వారికి గుడ్ న్యూస్ రానుందా..!

HIGHLIGHTS

Xiaomi యుజ్లర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ ఇవ్వనుందా

లేటెస్ట్ అప్డేట్ అందించడానికి కంపెనీ రెడీ అవుతోందని భావిస్తున్నారు

సోర్స్ కోడ్ లో ఈ 9 షియోమి స్మార్ట్ ఫోన్ల పేర్లు కనిపించాయి

డిసెంబర్ నెలలో  ఈ Xiaomi ఫోన్స్ వున్న వారికి గుడ్ న్యూస్ రానుందా..!

Xiaomi యుజ్లర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ ఇవ్వనుందా అంటే నిజమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. షియోమి స్మార్ట్ ఫోన్స్ కోసం లేటెస్ట్ అప్డేట్ అందించడానికి కంపెనీ రెడీ అవుతోందని భావిస్తున్నారు. షియోమి రాబోయే అప్ కమింగ్ వెర్షన్ MIUI 13. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల కావచ్చని లేటెస్ట్ లీక్స్ మరియయు రూమర్లు చెబుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఇప్పటి వరకూ ఇది ఇలా ఉండగా కొత్తగా వచ్చిన ఒక నివేదిక షియోమి కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న ఫోన్ల పేర్లతో కూడిన లిస్ట్ అందించింది. కానీ, ఎప్పటి వరకూ ఈ అప్డేట్ వస్తుందనే ఒక నిర్ణీత తేదీని మాత్రం వెల్లడించలేదు.

ట్విట్టర్ యూజర్ Xiaomiui | Xiaomi & MIUI News నివేదిక ప్రకారం మొదటి విడతలో ఒక 9 షియోమి స్మార్ట్ ఫోన్లు MIUI 13 అప్డేట్ అందుకుంటాయి. MIUI 13 యొక్క సోర్స్ కోడ్ లో ఈ 9  షియోమి స్మార్ట్ ఫోన్ల పేర్లు కనిపించాయి. ఆ 9  షియోమి స్మార్ట్ ఫోన్ల యొక్క లిస్ట్ క్రింద చూడవచ్చు.

MIUI 13 ముందుగా అందుకోనున్న ఫోన్ల లిస్ట్

1. Xiaomi Mi Mix 4

2. Xiaomi Mi 11

3. Xiaomi Mi 11 Pro

4. Xiaomi Mi 11 Ultra

5. Xiaomi Mi 11 Lite

6. Xiaomi Mi 10S

7. Redmi K40

8. Redmi K40 Pro

9. Redmi K40 Pro+

MIUI 13 లాంచ్ డేట్

వాస్తవానికి, ఇప్పటి వరకు MIUI 13 గురించి వచ్చిన సమాచారం అంతా కూడా లీక్స్ మరియు రూమర్ల ద్వారా వాళ్ళదైనది మాత్రమే.  MIUI 13 అప్డేట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, లీక్స్ మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి ఈ అప్డేట్  విడుదల చేయబడుతుందని సూచిస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo