Xiaomi మరియు Redmi ఫోన్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్..!
Xiaomi అప్ కమింగ్ కొత్త వెర్షన్ MIUI 13
ముందుగా ఈ స్మార్ట్ ఫోన్లు MIUI 13 అప్డేట్ అందుకుంటాయి
ఈ నెలలో Xiaomi కొత్త అప్డేట్ చెయ్యడానికి సిద్దవుతున్నట్లు భావిస్తున్నారు
Xiaomi తన కొత్త అప్డేట్ MIUI 13 విడుదల చెయ్యడానికి సిద్దవుతున్నట్లు సూచిస్తున్నారు. ఈ నెల 12 వ తేదీ షియోమి ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా రాబోయే కొత్త వెర్షన్ ను ప్రకటిస్తుందని చాలా విశ్వసనీయంగా నివేదిక అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక షియోమి కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న ఫోన్ల పేర్లతో కూడిన లిస్ట్ కూడా అందించింది. కానీ, ఎప్పటి వరకూ ఈ అప్డేట్ వస్తుందనే ఒక నిర్ణీత తేదీని మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు కొత్త రూమర్లు డేట్ ను కూడా సూచిస్తున్నాయి.
Surveyట్విట్టర్ యూజర్ Xiaomiui | Xiaomi & MIUI News నివేదిక ప్రకారం మొదటి విడతలో ఒక 9 షియోమి స్మార్ట్ ఫోన్లు MIUI 13 అప్డేట్ అందుకుంటాయి. MIUI 13 యొక్క సోర్స్ కోడ్ లో ఈ 9 షియోమి స్మార్ట్ ఫోన్ల పేర్లు కనిపించాయి. ఆ 9 షియోమి స్మార్ట్ ఫోన్ల యొక్క లిస్ట్ క్రింద చూడవచ్చు.
MIUI 13 ముందుగా అందుకోనున్న ఫోన్ల లిస్ట్
Xiaomi Mi Mix 4
Xiaomi Mi 11
Xiaomi Mi 11 Pro
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11 Lite
Xiaomi Mi 10S
Redmi K40
Redmi K40 Pro
Redmi K40 Pro+
MIUI 13 లాంచ్ డేట్
వాస్తవానికి, ఇప్పటి వరకు MIUI 13 గురించి వచ్చిన సమాచారం అంతా కూడా లీక్స్ మరియు రూమర్ల ద్వారా వాళ్ళదైనది మాత్రమే. MIUI 13 అప్డేట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, లీక్స్ మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి ఈ అప్డేట్ విడుదల చేయబడుతుందని సూచిస్తున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile