షావోమి LED స్మార్ట్ బల్బ్ : ఒకే బల్బుతో మీకు నచ్చినట్లుగా రంగులు మార్చుకోవచ్చు

HIGHLIGHTS

ఓకే బల్బ్ తో అనేక రంగులను మార్చుకోవచ్చు.

16 మిలియన్ కలర్ అప్షన్లలో కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు.

1 సంవత్సరాల దీర్ఘ కాలం పనిచేసేలా దీన్ని అందించింది షావోమి సంస్థ.

షావోమి ఇండియాలో ఒక సరికొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చింది. మీ మూడ్ ను బట్టి కావాల్సిన కలర్ ను సెట్ చేసుకునేలా, ఒక స్మార్ట్ LED బల్బును ప్రవేశపెట్టింది. ఓకే బల్బ్ తో అనేక రంగులను మార్చుకోవచ్చు. అంతేకాకుండా, ఒక మొబైల్ ఆప్ తో మనకు కావాల్సిన విధంగా, అనేక రకాలైన రంగులను సెట్ చేసుకోవచ్చు  మరియు స్టూడియో లాంటి వాతావరణాన్ని మం గదిలోనే సృష్టించుకోవచ్చు.

షావోమి LED స్మార్ట్ బల్బ్ ప్రత్యేకతలు :

ఈ స్మార్ట్ LED బల్బ్ చూడటానికి మన సాధారణ LED బల్బుల వలెనే కనిపిస్తుంది. కానీ, ఇది అందించే కలర్ వైవిధ్యాలను చూస్తే, నిజంగా ఆశ్చర్యతోవాల్సిందే. ఎందుకంటే, ఇది 16M కలర్ ఎంపికలతో వస్తుంది. అవును మీరు విటుంది నిజమే, దీనితో ఈ 16 మిలియన్ కలర్ అప్షన్లలో కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, దీన్ని మీ మొబైల్ ఫోనుతో కంట్రోల్ చేయ్యవచ్చు మరియు 11 సంవత్సరాల దీర్ఘ కాలం పనిచేసేలా దీన్ని అందించింది షావోమి సంస్థ.

అధనంగా, ఈ షావోమి స్మార్ట్ LED బల్బు Alexa మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వాటికీ అనుగుణముగా నడుచుకుంటుంది, అంటే వాటి ఆజ్ఞలను పాటిస్తుంది. ఈ విషయం నిజంగా మెచ్చుకోతగినది మరియు ఇప్పటి వరకు ఎవరికి రానటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు. అలాగే, దీన్ని మనం క్యాండిల్ లైట్, స్టూడియో లైట్, మ్యాచ్ లైట్, లేదా ఫ్లోరా సేంట్ లాంప్ లాగా అనేక విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని Mi Home App తో చక్కగా మరియు సులభంగా కంట్రోల్ చెయ్యవచు. ఇది 10W సమర్థయం తో వస్తుంది మరియు రేపు మధ్యాహ్నం 12 గంటలకి Mi Crowdfunding నుండి అమ్మకాలను మొదలు పెట్టనుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :