ఇండియాలో సరికొత్త MI Air Purifier 2C లాంచ్ : ధర కేవలం రూ. 6,499

Updated on 16-Oct-2019
HIGHLIGHTS

ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్ ఒక గంటకు 350 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేసే శక్తితో వస్తుందని వివరించారు.

షావోమి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమం మొదలవుతుండగానే, సంస్థ యొక్క ఇండియా హెడ్ మరియు గ్లోబల్ వైస్ ప్రసిడెంట్ అయినటువంటి, మనూ కుమార్ జైన్ ఈ కార్యక్రమం ద్వారా 5 కొత్త ప్రొడక్టులను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. వాటిలో ముందుగా ఎయిర్ పొల్యూషన్ నుండి మంచి గాలిని పొందడానికి వీలుగా ఒక కొత్త MI Air Purifier 2C ని విడుదల చేశారు.

ఈ MI Air Purifier 2C ని చాలా మంచి ప్రత్యేకతలతో తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, చాలా ప్రత్యేకతలు కలిగివున్న ఈ ఎయిర్ ప్యూరీఫయర్ ను కేవలం రూ.6,499 ధరలో విడుదల చేశారు. ఏది ఇండియా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఇండియాలోనే తయారు చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

MI Air Purifier 2C ప్రత్యేకతలు

ఈ MI Air Purifier 2C డబుల్ ఫిల్టరేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది గాలిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది ట్రూ HEPA ఫిల్టర్ తో వస్తుంది కాబట్టి 99.97% గాలిని శుభ్రపరిచి ఎటువంటి హానిలేని స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటుగా, రియల్ టైం ఎయిర్ ఇండికేటర్ తో వస్తుంది కాబట్టి ఇది ఈ ఇంట్లోని గాలి యొక్క ప్రమాదస్థాయిని వెంటనే తెలియచేస్తుంది. ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్ ఒక గంటకు 350 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేసే శక్తితో వస్తుందని వివరించారు.         

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :