why Aadhaar Deactivate some times and how to do Aadhaar Active
ఆధార్ కార్డు భారతదేశంలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్ గా పరిగణింపబడుతుంది. ఎందుకంటే, SIM కార్డు మొదలుకొని బ్యాంక్ అకౌంట్ వరకు చాలా సర్వీస్ లకు ఆధార్ కార్డు ప్రధాన పత్రం అవుతుంది. అయితే, అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు డీ యాక్టివేట్ లేదా ఇన్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే ఆ ఆధార్ హోల్డర్ కి సంబంధించి బ్యాంక్ సర్వీస్ తో పాటు అనేక సర్వీస్ లు నిలిచిపోతాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే Aadhaar Activate ఎలా చేయాలో ఈరోజు తెలుసుకోండి.
ఆధార్ నంబర్ ను కార్డ్ హోల్డర్ ఎక్కువ కాలం ఉపయోగించకపోతే ఆ కార్డ్ ఇన్ యాక్టివ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు లో లేటెస్ట్ లేదా సరైన డాక్యుమెంట్లు అప్డేట్ చేయకపోవడం కూడా ఆధార్ ఇన్ యాక్టివ్ కు ఒక కారణం కావచ్చు. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో UIDAI కొత్త డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం అభ్యర్ధన పంపుతుంది. సరైన సమయంలో ఆ వివరాలు అందించకపోతే కూడా ఆధార్ డీ యాక్టివేట్ కావచ్చు. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే UIDAI ఆ వ్యక్తి ఆధార్ కార్డు ను నిలిపివేస్తుంది.
ఇకవేళ ఏదైనా కారణాల చేత ఆధార్ డీ యాక్టివేట్ అయితే మీకు గడ్డుకాలం మొదలవుతుంది. మీ బ్యాంకు సేవలు నిలిచి పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొత్త SIM తీసుకోవడం లేదా రీ వెరిఫికేషన్ లో సమస్యలు రావచ్చు. మీకు నష్టం కలిగించే ప్రధానమైన సమస్య ఏమిటంటే ప్రభుత్వ పథకాల లాభాలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. పెన్షన్, సబ్సిడీ పథకాలు మరియు PM కిసాన్ వంటి ప్రభుత్వ పథకాలు మీకు నిలిచి పోతాయి.
Also Read: Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి కేవలం రూ. 5,999 ఆఫర్ ధరలో.. ఎక్కడంటే.!
మీ ఆధార్ డీ యాక్టివేట్ అయితే ఆ ఆధార్ కార్డ్ ను యాక్టివేట్ చేయడానికి మీరు ఆధార్ సెంటర్ ని దర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, ఇది చాలా సులభమైన మరియు ఉత్తమ మార్గం. అయితే, ఆధార్ సెంటర్ కి వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇందులో, ఆధార్ కాపీ, పాన్ లేదా ఓటర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్ మరియు మొబైల్ నెంబర్. ఈ డాక్యుమెంట్స్ ఆధార్ సెంటర్ లో సబ్ మీట్ చేసి ఆధార్ ను అప్డేట్ చేయాలి.
ఒకవేళ 7 సంవత్సరాల పిల్లల ఆధార్ నిలిచిపోతే బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి రావచ్చు. ఇలా చేస్తే ఆధార్ యాక్టివ్ అవుతుంది. మీ ఆధార్ అడ్రస్, ఫోటో మరియు ఐడెంటిటీ ప్రూఫ్ వంటివి వివరాలతో ఆధార్ ను అప్డేట్ చేయండి. ఇలా చేస్తే కూడా ఆధార్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.