Whatsapp: వాట్సాప్ లో కొత్త స్క్రీన్షాట్ బ్లాకింగ్ ఫీచర్ వస్తోంది..!
Whatsapp చాలా కాలానికి గొప్ప ఫీచర్ ను పొందబోతోంది
వాట్సాప్ లో అవసరమైన కొత్త ఫీచర్ వస్తోంది
ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వెర్షన్ లో టెస్టింగ్ ను కూడా పూర్తి చేసింది
జనరంజక చాటింగ్ యాప్ వాట్సాప్ చాలా కాలానికి గొప్ప ఫీచర్ ను పొందబోతోంది. వాట్సాప్ లో అవసరమైన మరియు ఉపయోగకరమైన కొత్త ఫీచర్ ను జత చేస్తోంది, వాట్సాప్ లో కొత్తగా Screen Shot Blocking ఫీచర్ ను వాట్సాప్ జతచేసింది. ఈ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్ లో టెస్టింగ్ ను కూడా పూర్తి చేసింది. Android 2.22.22.3 వెర్షన్ WhatsApp బీటా లో 'View Once' మెసేజిలను స్వీకరించే వారిని స్క్రీన్‌షాట్ చేయకుండా నిరోధిస్తుందని WaBetaInfo తెలియజేసింది.
SurveyWaBetaInfo ప్రకారం, ఒక్కసారి ఈ ఫీచర్ యాక్టివ్ అయితే వ్యూ-వన్స్ ఇమేజ్ లేదా వ్యూ-వన్స్ వీడియో ద్వారా మీరు స్క్రీన్ షాట్ తియ్యాలని ప్రయత్నిస్తే, మీకు కేవలం బ్లాక్ స్క్రీన్ మాత్రమే దర్శనమిస్తుంది. అంతేకాదు, “can’t take a screenshot due to security policy” అనే టోస్ట్ మెసేజీని వాట్సాప్ మీకు చూపిస్తుంది.
ఇక మరిన్ని ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ గురించి మరిన్ని ఇతర వివరాల్లోకి వెళితే, ఎవరైనా స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ తీయడానికి ప్రయత్నించిన విషయం అవతలి వ్యక్తికి తెలియదు. కానీ, దానికి బదులుగా స్క్రీన్ షాట్ కోసం ప్రయత్నించే వ్యక్తికి పైన పేర్కొన్న విధంగా టోస్ట్ మెసేజ్ మరియు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి, కేవలం ఇమేజిలు మరియు వీడియోలకు మాత్రమే ఈ బ్లాకింగ్ పరిమితి వర్తిస్తుంది. అంటే మీరు చాట్‌లు మరియు మెసేజ్‌లలో కొన్ని View Once' స్వభావం కలిగి ఉన్నప్పటికీ వాటి స్క్రీన్ షాట్ లను తీసుకోవచ్చు.
అయితే, మరొక ఫోన్ కెమెరాతో ఈ వీడియోలను లేదా ఇమేజిలను షూట్ హన్స్ వారిని మాత్రం ఇది ఆపలేదు. Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉన్న Android 2.22.22.3 వెర్షన్ WhatsApp బీటాలో భాగంగా స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ గుర్తించబడింది. ఇది ఇప్పటికీ బీటాలో ఉంది కాబట్టి, ఇది అమలులోకి వచ్చేనాటికి కొన్ని మార్పులు లేదా మెరుగుదలలను మీరు ఆశించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile