వాట్సాప్ కొత్త ఫీచర్ తో Screen Shot తీసేవారికి చెక్..!

వాట్సాప్ కొత్త ఫీచర్ తో Screen Shot తీసేవారికి చెక్..!
HIGHLIGHTS

వాట్సాప్ అప్ కమింగ్ అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్ జత చేయనున్నది

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ కోసం బీటా వెర్షన్ లో వాట్సాప్ జతచేసింది

ఈ ఫీచర్ వచ్చిందంటే ఇక Screen Shot తీసుకోలేరు

వాట్సాప్ అప్ కమింగ్ అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్ జత చేయనున్నది. అదే, Whastapp Screen Shot Blocking ఫీచర్ మరియు ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ కోసం బీటా వెర్షన్ లో వాట్సాప్ జతచేసింది. Android 2.22.22.3 వెర్షన్ లో ఈ స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ ను WhatsApp టెస్టింగ్ కోసం యాడ్ చేసింది. వాట్సాప్ లో వచ్చే మీడియా ఫైల్ అయిన ఇమేజిలు మరియు వీడియోలను 'View Once' అప్షన్ ద్వారా స్క్రీన్‌షాట్ తీసుకోకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుందని WaBetaInfo వెల్లడించింది.

WaBetaInfo ప్రకారం, ఒక్కసారి ఈ ఫీచర్ యాక్టివ్ అయితే వ్యూ-వన్స్ ఇమేజ్ లేదా వ్యూ-వన్స్ వీడియో ద్వారా మీరు స్క్రీన్ షాట్ తియ్యాలని ప్రయత్నిస్తే, మీకు కేవలం బ్లాక్ స్క్రీన్ మాత్రమే దర్శనమిస్తుంది. అంతేకాదు,  “can’t take a screenshot due to security policy” అనే టోస్ట్ మెసేజీని వాట్సాప్ మీకు చూపిస్తుంది.

ఇక మరిన్ని ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ గురించి మరిన్ని ఇతర వివరాల్లోకి వెళితే, ఎవరైనా స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ తీయడానికి   ప్రయత్నించిన విషయం అవతలి వ్యక్తికి తెలియదు. కానీ, దానికి బదులుగా స్క్రీన్ షాట్ కోసం ప్రయత్నించే వ్యక్తికి పైన పేర్కొన్న విధంగా టోస్ట్ మెసేజ్ మరియు బ్లాక్ స్క్రీన్‌ కనిపిస్తుంది. ప్రస్తుతానికి, కేవలం ఇమేజిలు మరియు వీడియోలకు మాత్రమే ఈ బ్లాకింగ్ పరిమితి వర్తిస్తుంది. అంటే మీరు చాట్‌లు మరియు మెసేజ్‌లలో కొన్ని View Once' స్వభావం కలిగి ఉన్నప్పటికీ వాటి స్క్రీన్‌ షాట్‌ లను తీసుకోవచ్చు.

అయితే, మరొక ఫోన్ కెమెరాతో ఈ వీడియోలను లేదా ఇమేజిలను షూట్ హన్స్ వారిని మాత్రం ఇది ఆపలేదు. Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉన్న Android 2.22.22.3 వెర్షన్ WhatsApp బీటాలో భాగంగా స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్ ఫీచర్ గుర్తించబడింది. ఇది ఇప్పటికీ బీటాలో ఉంది కాబట్టి, ఇది అమలులోకి వచ్చేనాటికి  కొన్ని మార్పులు లేదా మెరుగుదలలను మీరు ఆశించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo