Whatsapp DP Check: మీ వాట్సాప్ DP ఎంత మంది చూశారో ఇలా తెలుసుకోండి..!

HIGHLIGHTS

Whatsapp DP ఫోటో ఎవరు చూశారో తెలుసుకోవాలంటే ఎలా

మీ వాట్సాప్ డీపీ చునా వారి వివరాలు పొందవచ్చు

వాట్సాప్ లేటెస్ట్ బెస్ట్ ట్రిక్

వాట్సాప్ ఉన్న ప్రతిఒక్కరూ కూడా వారి వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ (DP) ద్వారా వారి సంతోషాన్ని లేదా బాధను లేదా మరింకేదైనా విషయాన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాదు, వారి గురించి అందరికి అర్ధమయ్యేలా  Whatsapp DP లేదా Whatsapp స్టేటస్ ద్వారా తెలియచేస్తున్నారు. మన వివరాలను ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనే కుతూహలం కూడా వారికీ వుంటుంది. అయితే,  స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో ఎవరు చూశారో తెలుసుకోవాలంటే ఎలా? మీకు కూడా ఈ కుతూహలం ఉండవచ్చు.

మీ Whatsapp ప్రొఫైల్ లేదా DP (డిస్ప్లే పిక్చర్) ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :