మీ వాట్సాప్ ప్రొఫైల్ ఎవరెవరు చూశారో తెలుసా?

Updated on 20-Jul-2021
HIGHLIGHTS

మీ Whatsapp ప్రొఫైల్ ఫోటో ఎవరు చూశారో ఎలా చెక్ చేయాలి

ఈజీగా తెలుసుకోవచ్చు

బెస్ట్ వాట్సాప్ ట్రిక్

Whatsapp ప్రతిఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఆన్లైన్ క్లాస్ కోసం పంపించే లింక్స్, మనం ఇష్టపడేవారితో చాటింగ్ లేదా మన స్నేహితులు మరియు సన్నిహితులకు మనం తెలిపే మన స్టేటస్ తో పాటుగా మరిన్ని అవసరాలకు వాట్సాప్ వేదికగా మారింది. అంతేకాదు, ఎక్కువ మంది ప్రజలు చాలా పనులను వాట్సాప్ ద్వారా చక్కబెట్టేస్తున్నారు.

అతివంటి వాట్సాప్ లో మన గురించి అందరికి అర్ధమయ్యేలా చెప్పాలంటే మాత్రం Whatsapp DP ఫోటో లేదా Whatsapp స్టేటస్ ద్వారా మన గురించి చెబుతాం. కానీ, కొన్ని సార్లు మన స్నేహితులు లేదా సన్నిహితులు లేదా మనకు తెలిసిన వారితో మనకు మనస్పర్థలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో, మనం వారిని మన వాట్సాప్ అకౌంట్ నుండి బ్లాక్ చెయ్యడం లేదా తొలిగించడం వంటి పనులు చేస్తాము. అటువంటి సమయంలో మనం డిలీట్ లేదా బ్లాక్ చేసిన వారితో పాటుగా ఇంకా ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో ఇలా తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండవచ్చు.

మీ Whatsapp స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :