HIGHLIGHTS
మీ డబ్బు తప్పు అకౌంట్ కి వెళ్లిందా
బ్యాంక్ అకౌంట్ నుండి రాంగ్ ట్రాన్సఫర్ అయ్యిందా
మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఇవే
ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా తమ బ్యాంక్ పనులను నిర్వహిస్తున్నారు. ఎందుకంటే, ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సులభమైన పద్దతి మరియు ఎక్కడి నుండైనా స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ద్వారా చెయ్యొచ్చు. అయితే, ఆన్‌లైన్ లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, అమౌంట్ ట్రాన్స్ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే బ్యాంక్ ను ఆ తప్పును గురించి బ్యాంక్ ను సంప్రతించి దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
Surveyముఖ్యంగా, అకౌంట్ నంబర్ ఎంటర్ చేసేప్పుడు జాగ్రత్తగా సరి చూసుకోవాలి. అంతేకాదు, IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే, అనుకోకుండా మీ డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ అయితే ఏమి చేయాలి? అని ఈరోజు తెలుసుకుందాం.
1. మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్ళండి
2. మీ వివరాలను ఆపరేషన్స్ మేనేజర్ కు అందించండి
3. బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ మీకు చాలా వరకు సహాయం చెయ్యగలరు
4. అలాగే, మీరు డబ్బు పంపిన బ్యాంక్ కి వెళ్లి అక్కడి మేనేజర్ ని కలిసి వివరాలను అందచేయ్యండి
5. ముఖ్యంగా, ప్రతి రోజు మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని సంప్రతించి వివరాలను తెలుసుకోండి
ఈ విధంగా డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ చేస్తే తిరిగిపొందే అవకాశం ఉంటుంది.