వివో టి1 5G యొక్క కొత్త సిల్కీ వైట్ కలర్ వేరియంట్ వచ్చింది

Updated on 21-Sep-2022
HIGHLIGHTS

వివో టి1 5G యొక్క కొత్త కలర్ వేరియంట్ ను వివో తీసుకొచ్చింది

కొత్త సిల్కీ వైట్ కలర్ వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ కొనేవారికి భారీ తగ్గింపు అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది

వివో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వివో టి1 5G యొక్క కొత్త కలర్ వేరియంట్ ను వివో తీసుకొచ్చింది. వివో టి1 5G ప్రారంభం నుండి రైన్ బో ఫాంటసీ మరియు స్టార్ లైట్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ మంచి అమ్మకాలను సాధిస్తుండడంతో వివో కొత్త సిల్కీ వైట్ కలర్ వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ధర మరియు ఇతర వివరాలను క్రింద చూడవచ్చు.                   

vivo T1 5G: ధర మరియు ఆఫర్లు

వివో ఇటీవల vivo T1 5G సార్ట్ ఫోన్ ను కేవలం రూ.15,990 ప్రారంభ ధరతో లభిస్తోంది మరియు ఇది 4GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. మరొక వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ ధర రూ.16,990 మరియు హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 128GB స్టోరేజ్ తో రూ.19,990 ధరతో వస్తుంది. ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనేవారికి భారీ తగ్గింపు అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.  

vivo T1 5G: స్పెక్స్

Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.

ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.     

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :