Whatsapp: ఈ కొత్త ఫీచర్ వస్తే 2GB ఫైల్స్ కూడా వాట్సాప్ లో షేర్ చేయవచ్చు..!!

HIGHLIGHTS

2GB ఫైల్స్ కూడా వాట్సాప్ లో షేర్ చేయవచ్చు

మీరు పెద్ద పెద్ద గ్రూప్స్ ను సైతం క్రియేట్ చేయవచ్చు

కొత్త ఫీచర్‌లను WhatsApp పరిచయం చేస్తోంది

Whatsapp: ఈ కొత్త ఫీచర్ వస్తే 2GB ఫైల్స్ కూడా వాట్సాప్ లో షేర్ చేయవచ్చు..!!

ఈ కొత్త ఫీచర్ వస్తే 2GB ఫైల్స్ కూడా వాట్సాప్ లో షేర్ చేయవచ్చు. ఇది మాత్రేమే కాదు మరికొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను కూడా అందులోకి తీసుకురావడానికి కూడా చూస్తోంది. ఈ ఫీచర్లు కనుక వాట్సాప్ లో అందుబాటులోకి వస్తే మీరు పెద్ద పెద్ద గ్రూప్స్ ను సైతం క్రియేట్ చేయవచ్చు మరియు ప్రస్తుతం కొనసాగిస్తున్న గ్రూప్ లలో సభ్యల పరిధి కూడా అమాంతంగా పెరిగిపోతుంది. మరి ఆ కొత్త ఫీచర్లు మరియు వాటి సంగతులు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

2GB పరిమాణంలో ఉన్న సింగిల్ ఫైల్ ను షేర్ చేయగలిగే మరియు 512 మంది సభ్యులతో కూడిన పెద్ద గ్రూప్ వంటి కొత్త ఫీచర్‌లను WhatsApp పరిచయం చేస్తోంది. అంతేకాదు, వీటితో పాటుగా థంబ్స్ అప్, స్మైల్, హార్ట్, ఏడుపు, షాక్ కు గురైన ముఖం మరియు ఫోల్డెడ్ హ్యాండ్స్ వంటి 6 రియాక్షన్ లను కూడా జత చేయనున్నది. అంటే, గ్రూప్‌ లలో ఎక్కువ మంది సభ్యులు, పెద్ద ఫైల్ షేరింగ్ మరియు ఎమోజీలతో మెసేజ్ పట్ల మీ భావోద్వేగాలను తెలియజేయడం వంటి కొత్త ఫీచర్లతో WhatsApp మరింత ఫీచర్-రిచ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా మారుతోంది.

వాస్తవానికి, ఇప్పటి వరకు 100MB ఫైల్ షేరింగ్ మాత్రమే ఉండగా దీని పరిమితిని ఏకంగా 2GB వరకూ పెంచడం మంచి విషయంగా పరిణమిస్తుంది. పెద్ద ఫీల్ షేరింగ్ కోసం ఇతర మార్గాల కోసం చూడకుండా వాట్సాప్ ద్వారా నే పంపించవచ్చు. అలాగే, ఈ షేర్ చేసేది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా భద్రపరచబడుతుంది. చిన్న వ్యాపారాలు మరియు స్కూల్ గ్రూప్స్ మధ్య సహకారానికి ఈ బిగ్ గ్రూప్ దోహదపడుతుందని WhatsApp భావిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo