రూ.20 వేల ధరలో ఇండియాలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2022)

రూ.20 వేల ధరలో ఇండియాలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ (మే 2022)
HIGHLIGHTS

భారతీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు చాలా వేగంగా విడుదల అవుతున్నాయి

20 వేల రూపాయల ధరలో కూడా ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి

బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్

మార్కెట్ కాంపిటీషన్ తో 20 వేల రూపాయల ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడా స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. అందుకే, భారతీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు చాలా వేగంగా విడుదల అవుతున్నాయి. అందుకే,  కేవలం 20 వేల రూపాయల పరిధిలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కలిగివున్న స్మార్ట్ ఫోన్లతో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లతో కూడా స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అందుకే, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కేవలం 20 వేల రూపాయల సెగ్మెంట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.  

Redmi Note 11 Pro+ 

ధర: రూ.20,999

ఈ Redmi Note 11 Pro+ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో మరియు గొరిల్లా గ్లాస్ 5 సేఫ్టితో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక 108MP కెమెరా,  8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో వస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

Redmi Note 11T

ధర: రూ.15,999

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ డ్యూయల్ 5G SIM సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.         

Realme 9SE 

ధర: రూ.19,999

రియల్ మీ 9SE వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరా,  8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో  సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల డిస్ప్లేని FHD + రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. 

Realme 8 Pro 

ధర: రూ.19,999

ఈ Realme 8 Pro ఒక 6.44 అంగుళాల SuperAMOLED డిస్ప్లేని 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగివుంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో,  f/1.88 ఎపర్చర్ కలిగిన ఒక 108MP Samsung HM2 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ని అందించింది. ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ Realme 8 Pro ఒక 4,500mAh బ్యాటరీని వేగవంతమైన 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 65W ఫాస్ట్ ఛార్జర్ ని కూడా అందించింది.

Xiaommi Redmi Note 11 Pro Max 

ధర: రూ.19,990

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ కలిగిన SuperAMOLED డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ 732G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో 108MP ISOCELL HM2 ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 33W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,020 బ్యాటరీ కూడా వుంది.                           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo