ఈరోజు తెలుగురాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..!

ఈరోజు తెలుగురాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది

బంగారం ధర ఇప్పటికీ 50 వేల మార్కును అంటి పెట్టుకునే వుంది

గోల్డ్ రేట్ ఈ సంవత్సర కనిష్టం వద్దనే కొనసాగుతొంది

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. కానీ, బంగారం ధర ఇప్పటికీ 50 వేల మార్కును అంటి పెట్టుకునే వుంది. వాస్తవానికి, గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్ ఎక్కువగా ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. నెల మొత్తంగా గోల్డ్ రేట్ మరియు మార్కెట్ ను పరిశీలిస్తే దాదాపుగా ఈ సంవత్సర కనిష్టం వద్దనే కొనసాగుతొంది. మరి ఈరోజు తెలుగురాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో తెలుసుకుందాం.               

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉండగా, ఈరోజు 200 రూపాయలు స్వల్పంగా పెరిగి 46,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,200 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,200 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,210 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,200 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo