TikTok Ban In India : ఇక మీ ఫోన్లలో ఈ 59 Chines Apps మాయం కాబోతున్నాయి

TikTok Ban In India : ఇక మీ ఫోన్లలో ఈ 59 Chines Apps మాయం కాబోతున్నాయి
HIGHLIGHTS

భారతదేశంలో అత్యధికంగా ప్రాచుర్యంలో వున్నా షార్ట్ వీడియో ప్లాట్ఫారం అయినటువంటి TikTok ప్రధమంగా నిలవడం విశేషం.

ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు తెలిపాయి

చైనాకి సంభందించిన 59 యాప్స్, భారతీయుల ప్రైవసీకి ప్రాశ్నర్ధకంగా మారినట్లు భవిస్తూ, భారతదేశంలో ఈ 59 చైనీస్ యాప్స్ ని పూర్తిగా నిషేధిస్తునట్లు ప్రకటించింది. అనేకమంది వినియోగదారులు తమ ఈ విషయాన్ని గురించి కంప్లైట్ నాందోహు చేసినట్లు కూడా పేర్కొంది. వీటిలో, భారతదేశంలో అత్యధికంగా ప్రాచుర్యంలో వున్నా షార్ట్ వీడియో ప్లాట్ఫారం అయినటువంటి TikTok ప్రధమంగా నిలవడం విశేషం.      

అంతేకాదు,  ఈ 59 యాప్స్ లో భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన యాప్స్ అయినటువంటి, TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo WeChat, SHAREit, UC News, UC Browser BeautyPlus, Xender, ClubFactory, మరియు Helo వంటి ప్రముఖ యాప్స్ తో పాటు మరికొన్ని ఫేమస్ యాప్స్ వున్నాయి.  అంటే, ఇక TikTok భారతీయుల మొబైల్స్ నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చు. 

      ముందుగా మేము నివేధించిన విధంగా,  భారత్, చైనా మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం తరువాత, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చెరుకోగా, భారతీయుల డేటా కూడా పైన చైనా నిఘా పెట్టినట్లు, దాని ద్వారా భారతీయుల డేటా చిక్కులో పడేఅవకాశం ఉందని, భారత నిఘా సంస్థలు హెచ్చరించడమే కాకుండా,  దీని మీద దృష్టిసారించిన భారత భద్రతా సంస్థలు, ఇలాంటి సమస్యల వాటిల్లే అనుమానమున్న 59 యాప్‌లను గుర్తించి,  చైనాతో సంభంధాలను కలిగివున్నఈ 59 Mobile Apps ను బ్లాక్ చేయాలని లేదా ఈ యాప్‌లను ఉపయోగించవద్దని భారతీయులకు సూచించాలని Indian Intelligence Agencies  ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

indian-ban-apps-inline.jpg

ఈ 59 Chinese Mobile Apps ఉపయోగించడం సురక్షితం కాదని ఏజెన్సీలు వాదించాయి. ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు తెలిపాయి. చైనీస్ డెవలపర్లు లేదా చైనీస్ లింక్‌లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికరమైన వస్తువులుగా ఉపయోగించవచ్చని  సూచించబడింది. ఈ అభ్యర్ధనల తరువాత భారత ప్రభుత్వం అనూహ్యంగా ఈరోజు ఈ 59 చైనా యాప్స్ ని నిషేదిస్తునట్లు ప్రకటించింది.      

ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన 59 Chinese Mobile Apps

TikTok, Shareit, Kwai, UC Browser, Baidu map, Shein, Clash of Kings, DU battery saver, Helo, Likee, YouCam makeup, Mi Community, CM Browers, Virus Cleaner, APUS Browser, ROMWE, Club Factory, Newsdog, Beutry Plus, WeChat,

UC News, QQ Mail, Weibo, Xender, QQ Music, QQ Newsfeed, Bigo Live, SelfieCity, Mail Master, Parallel Space, Mi Video Call — Xiaomi, WeSync, ES File Explorer, Viva Video — QU Video Inc, Meitu,

 Vigo Video, New Video Status, DU Recorder, Vault- Hide, Cache Cleaner DU App studio, DU Cleaner, DU Browser, Hago Play With New Friends,

Cam Scanner, Clean Master — Cheetah Mobile, Wonder Camera, Photo Wonder, QQ Player, We Meet, Sweet Selfie, Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, QQ Launcher, U Video, V fly Status Video, Mobile Legends, మరియు DU Privacy।

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo