థామ్సన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ఇరు కూలర్లు విడుదల చేసింది
గ్లాడియేటర్, ఎయిర్ కమాండర్ మరియు SUV సిరీస్ నుండి కొత్త ఎయిర్ కూలర్లు లాంచ్ చేసింది
ప్రతి ఒక్కరి అవసరాలకు తగిన కూలర్ ఎంచుకునే అవకాశం అందించింది
Thomson Air Cooler launched in India know the price and features
Thomson Air Cooler: థామ్సన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ఇరు కూలర్లు విడుదల చేసింది. గ్లాడియేటర్, ఎయిర్ కమాండర్ మరియు SUV సిరీస్ నుండి కొత్త ఎయిర్ కూలర్లు లాంచ్ చేసింది. వీటిలో పర్సనల్ మరియు రూమ్ ఎయిర్ కూలర్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి అవసరాలకు తగిన కూలర్ ఎంచుకునే అవకాశం అందించింది. సమ్మర్ 2026 కోసం థామ్సన్ లేటెస్ట్ గా అందించిన ఎయిర్ కూలర్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
Thomson Air Cooler: ప్రైస్
పర్సనల్ ఎయిర్ కూలర్ కేటగిరి నుంచి మూడు కూలర్లు లాంచ్ చేసింది. ఈ మూడు ఎయిర్ కూలర్ ప్రైస్ లిస్ట్ క్రింద చూడవచ్చు.
CPP28N మోడల్ 28L కూలర్ ప్రైస్ : రూ. 4,399
WM55N మోడల్ 55L కూలర్ ప్రైస్ : రూ. 6,499
WM60SN Smart మోడల్ 60L కూలర్ ప్రైస్ : రూ. 7,499
డెజర్ట్ కేటగిరి నుంచి కూడా మూడు ఎయిర్ కూలర్లు లాంచ్ చేసింది.
GD95S Smart మోడల్ 95L కూలర్ ప్రైస్ : రూ. 9,499
AC85 మోడల్ 85L కూలర్ ప్రైస్ : రూ. 8,999
CV130 మోడల్ 130L కూలర్ ప్రైస్ : రూ. 12,999
హెవీ డ్యూటీ డిజర్ట్ కేటగిరి నుంచి కూడా మూడు కొత్త ఎయిర్ కూలర్ లను విడుదల చేసింది.
HD105 మోడల్ 105L కూలర్ ప్రైస్ : రూ. 10,499
HD115 మోడల్ 115L కూలర్ ప్రైస్ : రూ. 10,999
HD150 మోడల్ 150L కూలర్ ప్రైస్ : రూ. 14,999
చివరిగా SUV సిరీస్ నుంచి కూడా రెండు కొత్త ఎయిర్ కూలర్లు విడుదల చేసింది.
SUV1700 మోడల్ 170L కూలర్ ప్రైస్ : రూ. 15,499
SUV1200 మోడల్ 120L కూలర్ ప్రైస్ : రూ. 11,999
థామ్సన్ మొత్తంగా 11 కూలర్లను కొత్తగా మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కూలర్లు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలయ్యే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కూలింగ్ డేస్ సేల్ నుంచి ఈ కూలర్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుకోవచ్చని థామ్సన్ తెలిపింది.
Thomson Air Cooler: ఫీచర్స్
థామ్సన్ ఈ కొత్త కూలర్లను గాలిని బాగా విసిరే హెవీ డ్యూటీ ఫ్యాన్ తో అందించింది. అంతేకాదు, ఇందులో మంచి చల్లని గాలిని ప్రసరింపచేసే తేనెపట్టు (హనీకోంబ్) డిజైన్ ప్యాడ్ కలిగి ఉంటాయి. వీటిలో స్మార్ట్ కూలర్లు రిమోట్ కంట్రోల్ సపోర్ట్ తో వస్తాయి. అంతేకాదు, పటిష్టమైన బాడీ మరియు ఆకట్టుకునే డిజైన్ తో కూడా ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.