TATA Sky మేడ్ ఇన్ ఇండియా సెటాప్ బాక్స్ లు వచ్చేశాయి

HIGHLIGHTS

TATA Sky మేడ్ ఇన్ ఇండియా సెటాప్ బాక్స్ లు వచ్చేశాయి

Made-In-India సెటాప్ బాక్స్ ఫస్ట్ బ్యాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది

సెటాప్ బాక్స్ ల మాస్ ప్రొడక్షన్ సెంటర్ చెన్నైలో ప్రారంభమయ్యింది

TATA Sky మేడ్ ఇన్ ఇండియా సెటాప్ బాక్స్ లు వచ్చేశాయి

మేడ్-ఇన్-ఇండియా సెటాప్ బాక్స్ ను తీసుకోస్తామన్న TATA Sky వాగ్దానాన్ని నిరవేర్చింది. ఇప్పుడు పూర్తిగా భారతదేశంలో నిర్మించిన Made-In-India సెటాప్ బాక్స్ ఫస్ట్ బ్యాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేడ్ ఇన్ ఇండియా సెటాప్ బాక్సులను టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ మరియు ఫ్లెక్స్ట్రానిక్స్ భాగస్వామ్యంతో తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రముఖ DTH ఆపరేటర్లలో ఒకరైన TATA Sky FY-21 లో చేసిన ప్రకటన ప్రకారం, టాటా స్కై యొక్క భారతీయ-నిర్మిత సెట్-టాప్ బాక్స్‌లను టెక్నికల్ కనెక్టెడ్ హోమ్ మరియు ఫ్లెక్స్ట్రానిక్స్ భాగస్వామ్యంతో తయారు చేసింది. ఈ మైలురాయి గురించి టాటా స్కై MD & CEO హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో తయారు చేసిన సెట్-టాప్ బాక్స్‌లు ఉపాధి సమాయానికి కూడా సహాయపడతాయి. నాణ్యత పరమైన హామీ కోసం ఈ బాక్సులను ఫ్యాక్టరీ ఫ్లోర్ దాటి టెస్ట్ మరియు ReTest  లను కూడా నిర్వహించారు. ఈ ప్రయత్నం భారతీయ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి మాకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము" అని తెలిపారు.

క్స్ట్రానిక్స్ భాగస్వామ్యంతో టెక్నికల్ కనెక్టెడ్ హోమ్ ద్వారా టాటా స్కై కోసం డెవలప్ చెయ్యబడిన సెటాప్ బాక్స్ ల మాస్ ప్రొడక్షన్ సెంటర్ చెన్నైలో ప్రారంభమయ్యింది. అంటే, ఇకనుండి టాటా స్కై పూర్తి దేశీయ టెక్నాలజీని తన సెటాప్ బాక్స్ ల కోసం ఉపయోగిస్తుంది. దీని ద్వారా వ్యయాన్ని కూడా తగ్గించవచ్చని కూడా కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo